Romantic Series : యవ్వనం మధురమైన జ్ఞాపకాలు, నిజమైన స్నేహాలు, మొదటి ప్రేమలు, ఛాలెంజ్ లతో నిండి ఉంటుంది. ఈ అనుభవాలన్నీ అందంగా చెప్పిన హార్ట్ టచింగ్ చైనీస్ సిరీస్ ‘ఆల్వేస్ హోమ్’ (Always Home 2025 Chinese series). ప్రముఖ రచయిత్రి షియావో గే రాసిన పాపులర్ నవల ‘Under the Tree, There’s a Red House’ ఆధారంగా 30 ఎపిసోడ్‌లతో తీసిన ఈ సిరీస్ లో జాయ్ షియావోవెన్, డానియల్ జౌ, యాంగ్ క్సిజీ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
2007లో 16 ఏళ్ల చెన్ హువాన్ ఎర్ చిన్న పట్టణం నుంచి తల్లితో కలిసి తియాన్ హే అనే సిటీకి వస్తుంది. ఆమె తల్లి స్థానిక ఆసుపత్రిలో ఉద్యోగం మారడం వల్ల, ఆసుపత్రి సిబ్బంది నివసించే ఒక అందమైన రెసిడెన్షియల్ కాంపౌండ్‌లో వారు సెటిల్ అవుతారు. కొత్త ప్రదేశం, కొత్త పాఠశాల, కొత్త వాతావరణం – హువాన్ ఎర్‌కి ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అయితే ఆ కాంపౌండ్‌లోనే ఆమె జీవితం మారిపోయే సంఘటనలు జరుగుతాయి. పొరుగు ఇంట్లో ఉండే ఇద్దరు అబ్బాయిలతో ఆమె స్నేహం ఏర్పడుతుంది. జింగ్ క్సిచి అల్లరి స్వభావం, ఎప్పుడూ నవ్వులు, ఫుట్‌బాల్ పట్ల మక్కువ ఉన్న ఎనర్జీటిక్ వ్యక్తి. చదువులో పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ, మంచి మనిషి. స్నేహితుల కోసం ఏమైనా చేసే స్వభావం ఉంటుంది.
ఇక సాంగ్ కాంగ్ శాంత స్వభావం, అత్యంత తెలివైన టాప్ స్టూడెంట్. బాధ్యతగా ఉంటూ, ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ ముగ్గురూ హైస్కూల్ రోజుల నుంచి ఒకరికొకరు మంచి బంధం ఏర్పరుచుకుంటారు. కలిసి చదువుకోవడం, వారాంతాల్లో విహారాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్, రాత్రి పుస్తకాలు చదవడం, ఒకరి ఇంట్లో ఒకరు సమయం గడపడం… యవ్వనంలోని అన్ని మధుర క్షణాలు వీరి జీవితంలో నిండి ఉంటాయి. కథ క్రమంగా ముందుకు సాగుతూ, వారు హైస్కూల్ నుంచి యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్, మొదటి ఉద్యోగాలు, కెరీర్ సవాళ్లు వరకు ప్రయాణం చేస్తారు.
స్నేహం నుంచి మొదలైన ఆకర్షణలు, సీక్రెట్ క్రష్‌లు, ఒకే గ్రూప్‌లో ఏర్పడే లవ్ ట్రయాంగిల్‌లు, వాటి వల్ల వచ్చే మనస్పర్థలు చాలా సహజంగా చిత్రీకరించారు. తల్లిదండ్రుల ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, విడాకులు లేదా కుటుంబంలో ఏర్పడే మార్పులు పిల్లల జీవితాలపై చూపే ప్రభావం, యవ్వనంలో ఎదురయ్యే నిజమైన బాధలన్నీ సహజంగా చూపించారు. ఈ సిరీస్ ముగిసేసరికి అమాయకమైన టీనేజ్ నుంచి బాధ్యతాయుతమైన, పరిణితి చెందిన యువకులుగా వారు ఎలా మారారో హార్ట్ టచింగ్ గా చూడవచ్చు. ‘హోమ్’ అంటే కేవలం ఇల్లు కాదు… మనం ఆశ్రయం పొందే వ్యక్తులు, జ్ఞాపకాలు, బంధాలు అని అందంగా చెప్పే సిరీస్ ఇది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.
Read Also : పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్