OTT Movie : ఓటిటిలోకి ఎన్నో రకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ యుద్ధం జరుగుతున్న సమయంలో జరుగుతూ ఉంటుంది. ఒక మహిళ అనారోగ్యంతో ఉన్న భర్తతో ఎదుర్కొనే సన్నివేశాలతో స్టోరీ నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే
అమెజాన్ ప్రై మ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘ది పేషెన్స్ స్టోన్’ (The Patience Stone). 2012 లో వచ్చిన ఈ ఫ్రెంచ్-ఆఫ్ఘన్ వార్ డ్రామా మూవీకి అతిక్ రహిమి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో గోల్‌షిఫ్తే ఫరాహానీ, హమీద్ జవదన్, మాస్సీ మ్రోవత్, హసినా బుర్గాన్ నటించారు. ఈ మూవీ 85వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా ఆస్కార్‌కి ఆఫ్ఘన్ ఎంట్రీగా ఎంపికైంది, అయినప్పటికీ ఈ మూవీ నామినేట్ కాలేదు. ఫరాహానీ 39వ సీజర్ అవార్డ్స్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ కేటగిరీకి నామినేట్ అయింది. ఈ మూవీ ఆఫ్ఘనిస్తాన్‌లో చిత్రీకరించారు. కాబూల్‌లోని సోవియట్ కాలం నాటి గృహాన్ని పోలి ఉండే మొరాకో ప్రాంతాల్లో చిత్రీకరించబడింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రై మ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హసీనా తన భర్తతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఒక ప్రమాదంలో తన భర్త మంచానికి పరిమితం అవుతాడు. అతనికి పెరాలసిస్ రావడంతో,ఎటూ కదలలేని తన భర్తని చూసుకుంటూ ఉంటుంది హసీనా. వీళ్ళు ఆఫ్గనిస్తాన్లో జీవిస్తూ ఉంటారు. అక్కడ యుద్ధ వాతావరణం కూడా ఉంటుంది. ఇంట్లో పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉంటుంది. గంజికాచుకోవటానికి కూడా డబ్బులు ఉండవు. హసీనా సహాయం కోసం తన స్నేహితురాలి దగ్గరికి వెళ్తుంది. ఆమె అక్కడ వ్యభిచారం చేస్తూ ఉంటుంది. పిల్లల్ని ఆమె దగ్గర ఉంచి, కొంత డబ్బు తీసుకుని ఇంటికి వస్తుంది. అదే సమయంలో ఒక ఉగ్రవాది హసీనాపై ఆఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత అతడు కొన్ని డబ్బులు ఆమెకు ఇచ్చి వెళ్లిపోతాడు. చేసేది ఏమీ లేక డబ్బులతో తన అవసరాలు తీర్చుకుంటుంది హసీనా. ఈ విషయాలన్నీ భర్తకి కూడా చెప్తూ ఉంటుంది.
నిజానికి ఇప్పుడు ఉన్న పిల్లలు భర్తకు పుట్టిన వాళ్లు కాదు. పిల్లలు పుట్టలేదని ఆమె అత్త నిందిస్తూ ఉండటంతో, భర్తకి తెలీకుండా వేరొకరితో పిల్లల్ని కంటుంది. ఇప్పుడు కూడా భర్తను వదిలి స్వేచ్చగా జీవించాలనుకుంటుంది. ఈ విషయం కూడా కదలలేని తన భర్తకు చెప్తుంది. ఇవన్నీ విన్న భర్త హసీనాని చంపాలని చూస్తాడు. ఇంతలో ముందుగా హసీనా భర్తను కత్తితో పొడిచి చంపేస్తుంది. చివరికి హసీనా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటుంది. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.