BigTV English

Lemon: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మీకు ‘నిమ్మకాయ’ చాలా అవసరం

Lemon: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మీకు ‘నిమ్మకాయ’ చాలా అవసరం

నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో నిమ్మకాయ నీరు తాగడం చాలా ముఖ్యం. వేసవి అయినా, శీతాకాలమైనా ప్రతిరోజూ నిమ్మకాయ రసాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అనేక రకాల పానీయాలు, వంటలలో నిమ్మకాయను భాగంగా చేరుస్తారు. అలాగే సాధారణంగా నిమ్మకాయ రసాన్ని తాగడం కూడా నిన్ను ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీ శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే నిమ్మకాయ నీరు ప్రతిరోజూ తాగడం అత్యవసరమని తెలుసుకోండి.


నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక పని తీరుకు మద్దతుగా నిలుస్తుంది. జలుబు, నీరసం, జ్వరం వంటి వాటిన మీరు త్వరగా తరచూ పడుతూ ఉంటే నిమ్మకాయ నీటిని తాగేందుకు ప్రయత్నించండి. ఇది నేను రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచుతుంది. మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

నిమ్మకాయలు పైత్యాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. నిమ్మకాయలలో ఉండే సిట్రిక్ ఆమ్లం మీ పొట్టలోని ఆమ్లాలను బాగా పనిచేసేలా చేస్తుంది. ఆహారాన్ని సమర్థవంతంగా విచ్చినం చేయడంలో ముందుంటుంది. నిమ్మకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ ఇతర జీర్ణ అసౌకర్యాలు రాకుండా ఉంటాయి.


నిమ్మకాయలో సహజ శక్తి ఉంటుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది అలసటను తగ్గిస్తుంది. నిమ్మకాయలలో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది ఆహారం నుండి శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది. అంతేకాదు రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.

పొడి చర్మంతో బాధపడేవారు, మొటిమలు అధికంగా వస్తున్న వారు కూడా నిమ్మకాయను వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ చర్మం పొడి బారినట్టు అనిపించినా తరచుగా చర్మం ముడతలు పడుతున్నా, చర్మం పై గీతలు పడుతున్నా నిమ్మకాయను తినేందుకు ప్రయత్నించండి. ఇందులో ఉండే విటమిన్స్ సి… కోల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇవి చర్మంపై ఉండే మచ్చలు, మడతలు వంటి వాటిని తగ్గిస్తాయి. ప్రకాశమంతమైన చర్మాన్ని, స్పష్టమైన కాంతిని ఇస్తాయి.

కొందరు తరచూ డిహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. ఒక నిమ్మకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్ కావచ్చు. కాబట్టి ఈ సిట్రస్ పండు ఈ శరీరంలోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. నీటి శోషణకు సహాయపడుతుంది. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. రోజంతా హైడ్రేషన్ ను ఉంచుకోవాలనుకుంటే నిమ్మకాయ నీటిని తాగడానికి ప్రయత్నించండి.

నిమ్మకాయలు సహజ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటాయి.ఇది మీ శ్వాసను తాజాగా ఉంచుతాయి. మీకు నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే అది బ్యాక్టీరియాల వల్ల కావచ్చు. కాబట్టి నిమ్మకాయ కలిపి నీరు తరచూ తాగుతూ ఉంటే నోటి నుండి దుర్వాసన పోతుంది.

నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల వాపును తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో బాధపడే వారికి నిమ్మకాయ నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం ద్వారా ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది.

Also Read: తులసి ఆకులు తింటే.. బోలెడు ప్రయోజనాలు !

సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మకాయ నీరు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది త్వరగా పొట్ట నిండిన భావనను అందిస్తుంది. నిమ్మకాయల్లో ఉండే పెక్టిన్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఆకలిని నివారిస్తుంది. కాబట్టి ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

నిమ్మకాయల సువాసన మెదడుకు విశ్రాంతిని అందిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి… కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×