BigTV English

OTT Movie : కుక్క తెచ్చిన తంట… ట్రైబల్స్ జీవితాలతో ఆటలు … పిచ్చెక్కించే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : కుక్క తెచ్చిన తంట… ట్రైబల్స్ జీవితాలతో ఆటలు … పిచ్చెక్కించే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలోకి రకరకాల సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్  మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో నివసించే ట్రైబల్స్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అలంగు’  (Alangu). 2024 లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి  S.P. శక్తివేల్ దర్శకత్వం వహించారు. మాగ్నాస్ ప్రొడక్షన్స్‌తో కలిసి డిజి ఫిల్మ్ కంపెనీపై డి శబరీష్ఎ, స్ఎ సంగమిత్ర ఈ మూవీని నిర్మించారు. ఇందులో గుణనిధి, కాళీ వెంకట్, చెంబన్ వినోద్ ప్రధాన పాత్రల్లో నటించగా, అప్పని శరత్, శ్రీరేఖ, సహాయక పాత్రల్లో నటించారు. తమిళనాడు-కేరళ సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ మూవీలో తమిళం, మలయాళం రెండు భాషల్లో డైలాగులు ఉన్నాయి. ‘అలంగు’ 27 డిసెంబర్ 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం  అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

తమిళనాడు బార్డర్ లో నివసించే ధర్మ కేరళలోని ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు. ఇతని తల్లి తనకు ఉన్న కొద్దిపాటి పొలంలో, చాలా కష్టపడి పనిచేసి కొడుకుని చదివిస్తూ ఉంటుంది. అయితే కాలేజీలో జరిగే కొన్ని గొడవల్లో ధర్మ సస్పెండ్ అవుతాడు. ఇంటికి సెలవులు ఉన్నాయని అబద్ధం చెప్పి వస్తాడు. సస్పెండ్ అయ్యానని తెలిస్తే తల్లి బాధ పడుతుందని అలా చెప్తాడు. ఒకసారి ఓ పెద్దమనిషి కుక్కని చంపుతుండగా, ధర్మ దానిని కాపాడుతాడు. అడవిలో వదిలితే పోతుంది కదా అని ఒకచోట వదులుతాడు. ధర్మాని వెతుక్కుంటూ ఆ కుక్క వెనక్కి రావడంతో దాన్ని పెంచుకుంటాడు. మరోవైపు అగస్తీయన్ అనే ఒక పేరు మోసిన రౌడీ ఉంటాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేసి పెద్ద స్థాయికి వస్తాడు. అతనికి కూతురు పుట్టడంతో, ఆమెను చూసుకుంటూ బిజినెస్ ని ఫిలిప్ అనే వ్యక్తికి అప్పజెప్తాడు.

అయితే ఫిలిప్ తన యజమానికి తెలియకుండా డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతని దగ్గరే ధర్మ అతని స్నేహితులు పనిచేయడానికి వస్తారు. ఇంతలోనే అగస్తీయన్ కూతురిని కుక్కలు అటాక్ చేయడంతో ఆమె బాగా భయపడుతుంది. ఊర్లో ఉన్న కుక్కలు అన్నిటిని చంపమని అగస్తీయన్ తన మనుషులకు చెప్తాడు. ఈ క్రమంలో వాళ్లు కుక్కల్ని చంపుకుంటూ వెళ్తారు. ధర్మ కుక్కను కూడా చంపడానికి వెళ్తారు. ఆ తర్వాత ఫిలిప్ కి ధర్మకి గొడవ మొదలవుతుంది. ధర్మాని కూడా చంపడానికి ఫిలిప్ ప్లాన్ వేస్తాడు. చివరికి ధర్మ, ఫిలిప్ ల గొడవ ఏమవుతుంది? ధర్మ సస్పెండ్ అయిన విషయం తల్లికి తెలుస్తుందా? ఇంతకీ  ధర్మ, పెంచుకున్న కుక్క బాటుకుటుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘అలంగు’  (Alangu) అనే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×