OTT Movie : హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు ఓటీటీలో ఒక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇచ్చే మూవీ కోసం వెతుకుతుంటే… ఈ రోజు మన సినిమా సజెషన్ మీ కోసమే! ఈ దక్షిణ కొరియన్ క్రైమ్-థ్రిల్లర్ సినిమా ఒక హిట్ మ్యాన్ జీవితంలో ఊహించని ట్విస్ట్ లు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇందులో ఒక హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ఒక గుండెలు ఆగిపోయే కథ మీకు కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ యంగ్-ఇల్ (గాంగ్ డాంగ్-వోన్) అనే హిట్ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. అతను తన బృందంతో కలిసి కాంట్రాక్ట్ కి హత్యలు చేయడంతో పాటు వాటిని ప్రమాదాలుగా చిత్రీకరిస్తాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు. అతని బృందంలో ఉన్న జాకీ (లీ మి-సూక్) ఒక అనుభవజ్ఞురాలైన ప్లానర్. క్రాస్-డ్రెస్సింగ్ నిపుణుడు వోల్-చియాన్ (లీ హ్యూన్-వూక్), జియోమ్-మాన్ (టాంగ్ జూన్-సాంగ్) అనే యంగ్ అబ్బాయి ఉన్నారు. ఈ టీం పేరు “ఎంప్టీ క్యాన్స్”. ఎందుకంటే వారికి ఎలాంటి అధికారిక గుర్తింపు లేదు.
హత్యలను ప్రమాదాలుగా కనిపించేలా డిజైన్ చేయడంలో యంగ్-ఇల్ కు ఉన్న టాలెంట్ ను చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఎటువంటి ఆనవాళ్లు లేకుండా తుడిచి పెట్టేస్తాడు. ఒక రోజు యంగ్-ఇల్‌కు ఒక హై-ప్రొఫైల్ రాజకీయ నాయకుడి కొత్త కాంట్రాక్ట్ వస్తుంది. మీడియాతో పాటు ప్రపంచ దృష్టిలో ఫుల్ ఫోకస్ లో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన. ఈ మిషన్ అత్యంత ప్రమాదకరమైనది, ఎందుకంటే చిన్న పొరపాటు కూడా వాళ్ళు పట్టుబడతారు. అయితే ఈ మిషన్ సమయంలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది,
ఒక సంవత్సరం క్రితం వీళ్ళ టీంలోని మెంబర్ జాక్‌నూన్ (లీ జాంగ్-సుక్) ఒక కారు ప్రమాదంలో చనిపోతాడు. కానీ యంగ్-ఇల్ దానిని ప్రమాదంగా అంగీకరించడానికి ఇష్టపడడు. “క్లీనర్స్” అనే మరో కాంట్రాక్ట్ కిల్లింగ్ గ్రూప్ దీని వెనుక ఉందని అనుమానిస్తాడు. తాజాగా మిషన్ సాగుతున్న కొద్దీ, యంగ్-ఇల్ స్వంత టీంనే అనుమానిస్తాడు. మరి క్లీనర్స్ నిజంగా ఉన్నారా? లేక యంగ్-ఇల్ అతిగా ఆలోచిస్తున్నాడా ? జాక్ ఎలా చనిపోయాడు ? అనేది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశాలు.
స్ట్రీమింగ్ ఇక్కడే
ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ పేరు ‘ది ప్లాట్’ (The Plot). లీ యో-సుప్ దర్శకత్వంలో తీసిన దక్షిణ కొరియన్ క్రైమ్-థ్రిల్లర్ 2024 లోనే రిలీజ్ అయ్యింది. ఇందులో గాంగ్ డాంగ్-వోన్ (యంగ్-ఇల్), లీ మి-సూక్ (జాకీ), లీ హ్యూన్-వూక్ (వోల్-చియాన్), టాంగ్ జూన్-సాంగ్ (జియోమ్-మాన్), జంగ్ యున్-చే (యంగ్-సియోన్), లీ జాంగ్-సుక్ (జాక్‌నూన్) తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హాంగ్ కాంగ్ చిత్రం Accident (2009)ku రీమేక్.