OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలంటే చెవి కోసుకునే వారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇలాంటి సినిమాల్లో ఉండే హారర్ ఎలిమెంట్స్, ఉత్కంఠభరితమైన సస్పెన్స్ మూవీ మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాదు, మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ను కూడా ఇస్తాయి. ఈరోజు మన మూవీ సజెషన్ అలాంటి మూవీనే. ఇందులో ఓ యూట్యూబర్ దశాబ్దం క్రితం జరిగిన దారుణాలను వెలికితీసే ప్రయత్నం ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ చిత్రం ఒక దశాబ్దం క్రితం జరిగిన ‘సీసీటీవీ మర్డర్ కేసు’ అనే భయంకరమైన సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లో జరిగిన డ్రామా షో సమయంలో ఎనిమిది మంది మరణించి, ఒకరు మాయం అవుతారు. ఒక ప్రముఖ అన్‌సాల్వ్‌డ్ రహస్యాలను వెలికితీసే పాపులర్ యూట్యూబర్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. తన ఛానెల్ సబ్‌స్క్రైబర్‌లు, వ్యూస్ ను పెంచుకోవడానికే ఈ కేసును రీ ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతాడు.
అందులో భాగంగా అప్పట్లో ఆ సంఘటన నుండి బయటపడిన ఏకైక వ్యక్తిని (కిమ్ డాన్-మి) కలవాలని అనుకుంటాడు. ఇప్పుడు ఒక ఆసుపత్రిలో ఉన్న ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వెళతాడు. ఇంటర్వ్యూ ప్రారంభమైనప్పుడు పది సంవత్సరాలుగా దాచబడిన భయంకరమైన రహస్యాలు బయట పడతాయి. ఈ ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేసిన హర్రర్ సీన్స్, ఒక ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఒక షాకింగ్ సత్యం వెల్లడవుతాయి. ఇంతకీ ఇంటర్వ్యూలో బయట పడ్డ ఆ సీక్రెట్స్ ఏంటి? ఆ ఆత్మ ఎవరిది? ఈ రివేంజ్ డ్రామాతో పాటు బయటపడ్డ నిజం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ప్రతిరోజూ ఎంప్లాయీస్ వాసన చూసే బాస్… ముసలాడు ఎందుకిలా చేస్తున్నాడో తెలిస్తే మైండ్ బ్లాక్
నాలుగేళ్ల తరువాత స్ట్రీమింగ్
ఈ హారర్ మూవీ పేరు “CCTV”. ఈ సౌత్ కొరియన్ హారర్-థ్రిల్లర్ సినిమాను హాంగ్-ఇక్ కిమ్ నిర్మించడంతో పాటు దర్శకుడిగా, రచయితగా కూడా వ్యవహరించారు. చానెల్ మాక్ నిర్మాణ సంస్థ ద్వారా విడుదలైంది. ఇందులో క్వాక్ డో-వోన్, వోన్ చూన్-గ్యూ, కిమ్ డాన్-మి, కిమ్ నామ్-గ్యూన్, పార్క్ కీ-ర్యుంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021లో థియేటర్లలో విడుదలైంది. నాలుగేళ్ల తరువాత అంటే 2025 జూన్ 27 నుండి ఇండియాలో ప్లేఫ్లిక్స్, OTT Play ప్రీమియంలో హిందీ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. హర్రర్ సినిమాలు అంటే ఇష్టపడే మూవీ లవర్స్ ఖచ్చితంగా ఈ మూవీపై ఓ లుక్కేయాల్సిందే. కాబట్టి డోంట్ మిస్.