OTT Movie : జీవితం పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అన్నట్టుగానే ఉంటుంది. పెళ్లికి ముందు ఎలా ఉన్నా, పెళ్లి తర్వాత కాస్త తెలివిగా ఆలోచించి బ్రతకాలి. లేకపోతే జీవితం చాలా తలక్రిందులు అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, పెళ్లికి ముందు పరిచయం ఉన్న వ్యక్తిని, పెళ్లి తర్వాత కూడా ఒక మహిళ ప్రేమిస్తుంది. ఆ తర్వాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
ఫ్లెక్స్ (Plex) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది రెడ్ త్రెడ్’ (The Red Thred). ఈ మూవీకి డేనియల్ గోగి దర్శకత్వం వహించాడు. పెళ్లి జరిగిన ఏడు సంవత్సరాల తరువాత బాయ్ ఫ్రెండ్ ను చూసి మళ్ళీ ప్రేమలో పడుతుంది యాబ్రియల్. ఇద్దరికీ వివాహం అయినా కూడా ఒకరంటే ఒకరికి ఇస్టం తగ్గలేదని తెలుసుకుంటారు. ఈ లవ్ స్టోరీ చివరికి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎండ్ అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
యాబ్రియల్ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తుంది. ఆమెకు ఒక ప్రయాణంలో మాన్యుల్ పరిచయం అవుతాడు. విమాన ప్రయాణం అంటే మాన్యుల్ కి కాస్త భయం ఉండటంతో, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి యాబ్రియల్ తో మాటలు కలుపుతాడు. అలా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాగా దగ్గరవుతారు. విమానంలోనే వాష్ రూంలో పని మొదలు పెట్టాలనుకుంటారు. అయితే విమానం ల్యాండ్ అవటంతో, బయట కలవాలనుకుంటారు. ఎయిర్ పోర్ట్ లో పోలీసులు హడావిడి చేయడంతో, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలవలేక పోతారు. మరోవైపు ఏడు సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరిని చూపిస్తారు. యాబ్రియల్ , బ్రూనా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. మాన్యుల్, సోఫియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ సంసారాన్ని హ్యాపీగా నడుపుతూ ఉంటారు. ఆ తర్వాత యాబ్రియల్ కి వేరొక దేశంలో డ్యూటీ చేయాల్సి వస్తుంది.
అక్కడికి వెళ్ళాక మాన్యుల్, యాబ్రియల్ కి ఎదురుపడతాడు. అలా వీళ్ళిద్దరూ మళ్లీ దగ్గరవుతారు. ఓకే గదిలో ఉంటూ, బెడ్ ను కూడా షేర్ చేసుకుంటారు. ఇక వీళ్ళు రెండు రోజులు బెడ్ మీద బాగా రెచ్చిపోతారు. మాన్యుల్, యాబ్రియల్ ఒకరిలో ఒకరు ఏమి చూసుకున్నారో గాని, ఒకరిని వదిలి ఒకరు ఉండలేక పోతారు. చివరికి వీళ్ళ విషయం ఇంట్లో వాళ్లకి కూడా తెలుస్తుంది. బంధాలను తెంపుకొని వీళ్ళిద్దరూ బయటకి వెళ్లి సంతోషంగా గడపాలి అనుకుంటారు. చివరికి కట్టుకున్న వాళ్లని వదిలి వెళ్ళిపోతారా? ఫ్యామిలీ తోనే కలిసి ఉంటారా? ఈ ప్రేమకి ఎండింగ్ ఎలా పడుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది రెడ్ త్రెడ్’ (The Red Thred) అనే ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.