BigTV English

NKR 21: ఎన్‌కేఆర్ 21 టైటిల్ ఫిక్స్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో హిట్‌పై కన్నేసిన కళ్యాణ్ రామ్

NKR 21: ఎన్‌కేఆర్ 21 టైటిల్ ఫిక్స్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో హిట్‌పై కన్నేసిన కళ్యాణ్ రామ్

NKR 21: ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది యంగ్ హీరోలు ఒక్క హిట్ పడితే చాలు అని ఎదురుచూస్తున్నారు. అలాంటి హీరోల్లో నందమూరి హీరో కూడా ఉన్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఒకటి, రెండు హిట్స్‌తోనే సర్దుకుంటున్నాడు. ప్రతీ సినిమాకు తన బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నా కూడా వాటి కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అందుకే తన తర్వాతి సినిమాతో అయినా ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికీ ‘ఎన్‌కేఆర్ 21’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు దీని టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.


అదే టైటిల్

నందమూరి కళ్యాణ్ రామ్ అప్‌కమింగ్ మూవీలో సీనియర్ నటి విజయశాంతి కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారు. హీరో తల్లి పాత్రలో ఆమె కనిపించనున్నట్టు తెలుస్తోంది. తల్లీకొడుకుల కథతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ మూవీకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పటికీ ఈ సినిమా ఏ జోనర్, ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది లాంటి అప్డేట్స్‌ను బయటపెట్టలేదు మేకర్స్. కానీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో ప్రేక్షకులు గెస్ చేసేలా ఒక్క పోస్టర్ మాత్రం విడుదల చేశారు. ఆ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచేశాడు కళ్యాణ్ రామ్.


ఇంట్రెస్టింగ్ పోస్టర్

‘ఎన్‌కేఆర్ 21’ నుండి విడుదలయిన ఫస్ట్ లుక్‌లో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) చేతిలో ఫైర్ ఉన్నట్టుగా చూపిస్తారు. తన వెనుక కొన్ని చైర్స్ కాలిపోతున్నట్టుగా ఉంది. అంతే కాకుండా కొందరు క్రిమినల్స్ తనను చుట్టుముట్టినట్టుగా కూడా ఈ పోస్టర్‌లో చూపించారు. పోస్టర్ మాత్రమే కాదు.. దానికి యాడ్ చేసిన క్యాప్షన్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ‘నువ్వు ఒక మంచి ఉదాహరణ కాలేకపోతే.. ఒక భయంకరమైన హెచ్చరిక అవ్వు’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ విడుదలయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ డ్రామా అయ్యిండొచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు కాబట్టి ఇందులో తల్లి, కొడుకుల సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

Also Read: సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్లింప్స్.. ఫైనల్‌గా ఆ వాయిస్ ఎవరిదో తెలిసిపోయిందోచ్.!

సీక్వెల్ లేనట్టేనా.?

కళ్యాణ్ రామ్ చివరిగా ‘డెవిల్’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదలయ్యి దాదాపు రెండేళ్లు అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘డెవిల్’కు భారీగా ప్రమోషన్స్ చేసి విడుదల చేశారు మేకర్స్. అందుకే ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా కాస్త పరవాలేదనిపించాయి. ఈ మూవీ విడుదల కాకముందే దీనికి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కళ్యాణ్ రామ్ సైతం ఈ సీక్వెల్ గురించి స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు ‘డెవిల్’ సీక్వెల్ విషయం పక్కన పెట్టి పూర్తిగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాపైనే ఫోకస్ చేయాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×