OTT Movie : హైదరాబాద్‌లో సత్యభామ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వర్క్‌ప్లేస్ హరాస్‌మెంట్, సమాజం నుండి అన్యాయమైన నిందలు, ఒక షాకింగ్ హత్య ఆరోపణతో చాలా ఇబ్బందులు పడుతుంది. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్త కూడా ఒక ప్రమాదంలో చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఈ కేసును ఒక పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ క్రమంలో షాక్ అయ్యే సంఘటనలు వెలుగులోకి వస్తాయి. ఇంతకీ సత్యభామ భర్త ఎలా చనిపోతాడు ? ఆమె ఎదుర్కునే నిందలు ఏమిటి ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
సత్యభామ (ఆనంది) ఒక ధైర్యవంతమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె తన వృత్తిలో, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఆమె భర్త ఒక దుర్ఘటనలో మరణించినప్పుడు ఆమె జీవితం తలకిందులవుతుంది. ఈ దుర్ఘటన ఒక సాధారణ ప్రమాదం కాదని, దాని వెనుక ఒక కుట్ర ఉందని ఆమె క్రమంగా తెలుసుకుంటుంది. మరో వైపు సత్యభామ తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లలో ఒకటి, ఆమె పని చేసే ప్రదేశంలో జరిగే హారస్‌మెంట్ (వేధింపులు). ఆమె ఈ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కానీ సమాజం ఆమెపై అన్యాయంగా నిందలు వేస్తుంది. దీనికి తోడు ఆమె ఒక హత్య ఆరోపణకు గురవుతుంది. ఇది ఆమె జీవితాన్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ ఆరోపణలు ఆమెను న్యాయవ్యవస్థ, సమాజం రెండింటిలోనూ ఒంటరిగా నిలబెడతాయి.
ఒక పోలీసు అధికారి అయిన సరికా సింగ్ (వరలక్ష్మి శరత్‌కుమార్)కు సత్యభామ తన కథను చెప్తుంది. సరికా సింగ్ ఒక తెలివైన డైనమిక్ అధికారి. ఆమె సత్యభామ కథను లోతుగా విని, ఆమెపై వచ్చిన ఆరోపణల వెనుక నిజాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. సత్యభామ తన జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనలను వివరిస్తూ, తన భర్త మరణం వెనుక ఉన్న కుట్రను బయటపెడుతుంది. ఈ కథ చాలా వరకు ఫోన్ సంభాషణల ద్వారా చెప్పబడుతుంది. చివరికి సత్యభామ తనపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడగలదా? ఆమె భర్త మరణం వెనుక ఉన్న నిజాన్ని కనిపెడుతుందా ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఫ్లైట్ లో హైజాకర్లకు చుక్కలు చూపించే పైలట్… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు
ఈ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘శివంగి లయనెస్’ (Shivangi Lioness). 2025 లో వచ్చిన ఈ సినిమాకు దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంది (సత్యభామ), వరలక్ష్మి శరత్‌కుమార్ (సారికా సింగ్), జాన్ విజయ్ (మాన్స్టర్ కె), కోయ కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 మార్చి 7న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, Aha OTTలో ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. 122 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.7/10 రేటింగ్ ఉంది.