OTT Movie : ఓటీటీలోకి ఒక మలయాళం మూవీ, మూడు నెలలు తిరక్కుండానే స్ట్రీమింగ్ కు వచ్చింది. కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో
ఈ మలయాళ కామెడీ డ్రామా మూవీ పేరు’ఆప్ కైసే హో?’ (Aap Kaise Ho?). 2025 ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాకు వినయ్ జోస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్రిస్టీ అనే యువకుడి బ్యాచిలర్ పార్టీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక రాత్రి సరదాగా ప్రారంభమై, మద్యం, గందరగోళం, unexpected twistsతో నిండిన రోలర్-కోస్టర్ రైడ్‌గా మారుతుంది. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, శ్రీనివాసన్, అజు వర్ఘీస్, రమేష్ పిషారోడి,సైజు కురుప్, జీవ జోసెఫ్, దివ్యదర్శన్, తన్వి రామ్ వంటి నటులు నటించారు. 1 గంట 45 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈసినిమాకి, IMDbలో 7.1/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025 జూన్ 20 నుంచి సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
క్రిస్టీ (ధ్యాన్ శ్రీనివాసన్)అనే యువకుడు సాధారణ జీవితం గడుపుతుంటాడు. గత కొంతకాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ, పెళ్ళి చేసుకోవడానికి సిద్దపడుతుంటాడు. పెళ్లికి వారం ముందు, తన స్నేహితులైన బినోయ్ (జీవ జోసెఫ్), సజీర్ (దివ్యదర్శన్)తో ఒక బ్యాచిలర్ పార్టీని జరుపుకోవాలని అనుకుంటాడు. క్రిస్టీ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఈ పార్టీకి అనుమతి ఇస్తుంది. ఈ ముగ్గురు స్నేహితులు ఒక unforgettable రాత్రిని ప్లాన్ చేస్తారు. ఇక ఈ పార్టీని వీళ్ళు ఒక రోజు రాత్రి మొదలుపెడతారు. ఇది సరదాగా, నవ్వులతో నిండిన వాతావరణంతో మొదలవుతుంది. ఈ ముగ్గురు స్నేహితులు కొంచెం carefree,కొంచెం immature గా ఉంటారు. వీళ్ళ మాటలుకూడా తేలికపాటి వ్యంగ్యంతో నిండి ఉంటాయి. ఈ పార్టీలో మద్యం, సంగీతం, సరదా కబుర్లతో జరుగుతుంది. అయితే ఒక్కసారిగా, జీవితం తలకిందులు అయ్యే సంఘటనలు జరుగుతాయి.
ఈ పార్టీ సమయంలో, మద్యం ప్రభావంలో ఉన్న క్రిస్టీ, బినోయ్, సజీర్ కొన్ని రెక్లెస్ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలలో ఒకటి వారిని ఒక మైనర్ అమ్మాయితో సంబంధం కలిగిన సమస్యలో చిక్కుకునేలా చేస్తుంది. వీళ్ళు ఈ సమస్య నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇద్దరు corrupt police officers కంట్లో కూడా వీళ్ళు పడతారు. ఈ సమస్యలు మరింత పెద్దవిగా మారుతాయి. క్రిస్టీ వివాహం, అతని స్నేహితులతో సంబంధం, అతని గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న నమ్మకం అన్నీ ప్రమాదంలో పడతాయి. క్రిస్టీ, అతని స్నేహితుల రెక్లెస్ చర్యల వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కొంటారు. ఈ మైనర్ అమ్మాయి కేసు చట్టపరమైన సమస్యలలో చిక్కుకునేలా చేస్తుంది. ఈ గందరగోళంలో, క్రిస్టీ, బినోయ్, సజీర్ మధ్య స్నేహం కూడా దెబ్బతింటుంది. సినిమా క్లైమాక్స్‌లో, క్రిస్టీ అతని స్నేహితులు, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్లాన్ వేస్తారు. చివరికి మైనర్ అమ్మాయి, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఏం జరుగుతుంది ? పోలీసులు ఎలాంటి కేసు పెడతారు ? వీళ్ళు వేసే ప్లాన్ ఏమిటి ? క్రిస్టీకి పెళ్ళి జరుగుతుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలు ఆ అపార్ట్మెంట్లో అడుగు పెడితే నరకమే… రెంట్‌కి ఉండాలంటే ప్రాణాలు వదులకోవాలి