BigTV English

OTT Movie : హిల్ స్టేషన్లో నరమేధం…అక్కడి వాళ్లకు మనుషులు దొరికారంటే అంతే సంగతులు

OTT Movie : హిల్ స్టేషన్లో నరమేధం…అక్కడి వాళ్లకు మనుషులు దొరికారంటే అంతే సంగతులు

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పటినుంచో కొత్త తరహాలో, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తూనే ఉన్నాయి. ఈ హారర్ మూవీస్ కామెడీ కంటెంట్ తో పాటు, వణుకు పుట్టించే కథలతో ప్రేక్షకులను భయపెడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది రిచువల్’ (The Rituval). ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీకి డేవిడ్ బ్రక్‌నర్ దర్శకత్వం వహించారు. వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీలో నలుగురు ఫ్రెండ్స్ హిల్ స్టేషన్ లో చిక్కుకుపోతారు. ఆ ప్రాంతంలో వీళ్ళు ఎదుర్కోబోయే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

డోమ్,ఫిలస్,హచ్,లూక్,రోబ్ అనే ఐదుగురు ఫ్రెండ్స్ ఒక రెస్టారెంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. వీళ్లంతా కలిసి హిల్ స్టేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అక్కడికి ఒక అగంతకుడు గన్ తీసుకుని బెదిరించి, అందరి దగ్గర డబ్బులు లూటీ చేస్తుంటాడు. అక్కడే ఉన్న హచ్ ఆ దొంగని పట్టుకోవాలని చూస్తాడు. అయితే ఆ దొంగ చేతిలో హచ్ చనిపోతాడు. హఠాత్తుగా ఇలా జరగడంతో మిగతా ఫ్రెండ్స్ చాలా బాధపడతారు. చనిపోయిన హచ్ జ్ఞాపకాలకి గుర్తుగా ఈ యాత్ర ప్రారంభిస్తారు. వీళ్లంతా ఒక కొండపైకి వెళ్లి అతని ఫోటో పెట్టి నివాళులు కూడా అర్పిస్తారు. అయితే ఆ ప్రాంతంలో వీళ్లకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఒక జింక చెట్టుకి వేలాడదీయబడి ఉంటుంది. ఇది జంతువులు చేసిన పని కాదని వీరంతా అనుకుంటారు. అయితే ఒక వింత రూపం వీళ్ళను వెంబడిస్తుంది. రాబ్, ఫిల్స్ ని కూడా అలాగే చంపి చెట్టుకి వేలాడదీస్తుంది.

వీరిలో ఇద్దరు మాత్రమే మిగులుతారు. వీళ్ళిద్దరిని అడవిలో ఉండే ట్రైబల్స్ ఒక ఉడెన్ హౌస్ కి బంధించి తీసుకెళ్తారు. అందులో లూక్ ని మాత్రం వదిలి, డామ్ ని బలి ఇవ్వడానికి చూస్తారు ట్రైబల్స్. ఈ క్రమంలోనే వీళ్ళని ఎవరిని వదలొద్దని, లూక్ కి చెప్పి ప్రాణాలు పోగొట్టుకుంటాడు డోమ్. ఆ ట్రైబల్స్ లూక్ కి బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తారు. నువ్వు బతకాలంటే బానిస అవ్వాలని చెప్తారు. చివరికి లూక్ ని ఆ వింత ఆకారం చంపుతుందా? ట్రైబల్స్ లూక్ కి ఇచ్చే అవకాశం ఏంటి? ఇంతకీ మనుషులను అక్కడ ఎందుకు బలి ఇస్తున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది రిచువల్’ (The Rituval) అనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×