BigTV English

Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి మళ్లీ పెళ్లి – షాక్ లో దుగ్గిరాల కుటుంబం

Brahmamudi Serial Today January 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి మళ్లీ పెళ్లి – షాక్ లో దుగ్గిరాల కుటుంబం

Brahmamudi serial today Episode:  ప్రకాష్‌, సుభాష్‌ దగ్గరకు వెళ్లి బాధపడతాడు. కావ్య అవమానం చేయడం వల్ల నా భార్య నాకు రేపటి నుంచి విలువ ఇస్తుందా..? అని అడుగుతాడు. దీంతో నాకు కొంచెం టైం ఇవ్వు నేను కావ్యతో మాట్లాడతానని సుభాష్ చెప్పగానే.. ఇప్పుడు మన దగ్గర లేనిదే టైం అన్నయ్యా అంటూ వెళ్లిపోతాడు ప్రకాష్‌. లోపలికి వెళ్లిన ప్రకాష్‌ కు కావ్య ఎదురొస్తుంది. కావ్యను చూసిచూడనట్టు వెళ్లిపోతుంటాడు ప్రకాష్‌. కావ్య ఎదురు వెళ్లి నలుగురిలో నేను అలా మాట్లాడటం తప్పే కానీ మనఃస్పూర్తిగా మీరు నన్ను క్షమించండి నేను మీ కూతురి లాంటి దాన్ని అంటుంది. నిజంగానే మేము చాలా గోల్డ్‌ తీసేసుకున్నాము అని చెప్తుంది.


అయినా నిన్ను క్షమించడానికి నేను ఎవరు? ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇంట్లో తిరగమంటావు. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేదమ్మా దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ప్రకాష్‌ వెళ్లిపోతాడు. అంతా గమనించిన ధాన్యలక్ష్మీ సూపర్‌.. నీ తెలివి తేటలు వేరే లెవెల్‌. అందరిలో ఆయన్ని అవమానించి ఇప్పుడు చీకట్లో క్షమాపణ అడుగుతున్నావా..? అంటుంది ధాన్యలక్ష్మీ.  ఎందుకు అత్తయ్యా ఇలా మారిపోతున్నారు. ఒకప్పుడు నాకు అందరిని కాదని నాకు సపోర్టు చేశారు. ఇప్పుడు ఎందుకు నన్ను శత్రువుగా చూస్తున్నారు అని కావ్య అడుగుతుంది.

మారింది నేను కాదు నువ్వు ఆస్థులు వచ్చాక నువ్వు మారిపోయావు. నాకు నా మొగుడికి అవమానం చేసి ఇప్పుడు ఇలా మాట్లాడతావా..? అంటూ ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. కావ్య బాధపడుతుంది. పైనుంచి అంతా గమనిస్తుంటాడు రాజ్‌. ఏడుస్తూ పైకి వచ్చిన కావ్యను రాజ్‌ ఓదారుస్తాడు. రాహుల్‌, రుద్రాణి స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూర్చుని ఉంటారు. ఓరే రాహుల్‌ ఈ ఫీలింగ్‌ ఏంట్రా ఇంత బాగుంది అంటుంది రుద్రాణి. ఏం ఫీలింగ్‌ మామ్ అంటాడు రాహుల్‌. ఆకాశం విరిగిపడ్డట్టు.. భూమి బద్దలైనట్టు థ్రిలింగ్‌ గా ఉంది అంటుంది. ఎన్నో ఏళ్ల కలలు ఇప్పుడిప్పుడే కదా నిజమవుతున్నాయి అంటాడు రాహుల్‌.


కరెక్టుగా చెప్పావురా నీలో ప్రవహించే నా రక్తం అప్పుడప్పుడు నాలా ఆలోచించేలా చేస్తుంది. దేవుడు మనల్ని అర్థం చేసుకుని ధాన్యలక్ష్మీ పుట్టింటి వాళ్ల రూపంలో ఒక అవకాశం ఇచ్చాడు. అవమాన పడ్డ ప్రకాష్‌ అంకుల్‌ కూడా త్వరలోనే మనతో కలుస్తాడు అంటాడు. ఒక చిన్న నిప్పురవ్వ అడవినే కాల్చేసినట్టు.. ఆ కావ్య చేసిన చిన్న తప్పిదంతో చిచ్చు రగిల్చి ఈ ఇంటినే కాల్చేద్దాం అంటుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అని అడుగుతాడు రాహుల్‌. వెంటనే నీ పెళ్లానికి సీమంతం చేయాలి అని చెప్తుంది రుద్రాణి. రాహుల్‌ షాకవుతాడు.

తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా.. శాంత వచ్చి అమ్మా ఏం టిఫిన్‌ చేయమంటారు అని అడుగుతుంది. రుద్రాణి షాక్‌ అవుతూ ఎవర్ని అడుగుతున్నావే.. ఈ ఇంటికి మహారాణి కావ్య శ్రీమతి కావ్యాదేవి గారు వెళ్లి చేతులు కట్టుకుని వెళ్లి ఆవిడనే అడుగు.. అంటుంది రుద్రాణి. కావ్యా మేడం మిమ్మల్నే అడగమన్నారు అని శాంత చెప్పగానే.. ఎందుకు ఇవన్నీ కవ్వింపు చర్యలా.. అయినా నువ్వు చేసేది ఎలాగైనా ఒక్కటే కదా ఏదో ఒకటి చేయ్‌ అంటుంది రుద్రాణి.

లేదమ్మా ఇవాళ్టీ నుంచి ఎవరెవరికి ఏం కావాలో అడిగి చేయమన్నారు అని శాంత చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఆవిడ మా మీద దయ చూపి శాసనాలు తిరగరాస్తున్నారు అంటూ రుద్రాణి వెటకారంగా మాట్లాడితే శాంత మీరు మాట్లాడింది నాకేం అర్థం కాలేదు అంటుంది. దీంతో నాకు అర్థం అయింది అంటూ కావ్య వస్తుంది. కొన్ని కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చింది. కానీ నా ప్రవర్తన వల్ల అందరూ బాధపడుతున్నారని మా ఆయన నాకు కొంచెం గడ్డి పెట్టారు అందుకే ఇవాళ్టీ నుంచి ఇలా అంటుంది. ముష్టి వాళ్లకు పడేసినట్టు నాలుగు రకాల కూరలు, నాలుగు రకాల టిఫిన్లు పెడితే నువ్వు చేసిన అవమానాలు అన్ని మర్చిపోతాము అనుకున్నావా..? అంటుంది ధాన్యలక్ష్మీ.

ఇంతలో పంతులు రావడంతో అయన్ని ఎవరు పిలిచారు అని ఇందిరాదేవి అడుగుతుంది. నేనే పిలిచాను అంటుంది రుద్రాణి. ఇప్పుడెందుకు పిలిచావని ఇందిరాదేవి అడగ్గానే.. నేను పెళ్లి చేసుకుందామని అంటుంది రుద్రాణి అందరూ షాక్ అవుతారు. ఇంతలో రుద్రాణి తన కోడలు స్వప్నకు సీమంతం జరిపించాలని అందుకే పంతులును పిలిపించానని చెప్తుంది. స్వప్న ఆశ్చర్యంగా మీరు అన్నది నిజమేనా.. మీరు ఇంత బాధ్యత ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అంటూ ప్రశ్నిస్తుంది.

రుద్రాణి నువ్వు బాగానే ఉన్నావా..? భ్రమ కానీ బ్రాంతి కానీ నిన్ను ఆవరిస్తున్నట్టు ఏమైనా ఉందా..? అంటూ ప్రకాష్‌ ప్రశ్నిస్తాడు. అదేం లేదు కానీ నేను అత్తగా సీమంతం జరిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కడుపులో పెరిగే బిడ్డ నా వారసుడు కాబట్టి అని చెప్తుంది. ఈ ఇంట్లో టీ కాఫీలకే దిక్కు లేదు.. ఇక సీమంతం అంటే ఏంటో అని నేను అడగలేదు అంటుంది స్వప్న. నువ్వేం బాధపడకు స్వప్న నీకు గ్రాండ్‌ గా సీమంతం జరిపించే బాధ్యత నాది అంటుంది రుద్రాణి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×