BigTV English

Sambhal Masjid Row: సంభల్ షాహీ మసీదు వివాదం.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించిన హై కోర్టు..

Sambhal Masjid Row: సంభల్ షాహీ మసీదు వివాదం.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించిన హై కోర్టు..

Sambhal Masjid Row| ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హై కోర్టు సంభల్ జిల్లాలోని వివాదాస్పద షాహీ జామా మసీదు కేసులో ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణపై స్టే విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.


సంభల్ షాహీ జామా మసీదు నిర్మాణం కొన్ని వందల సంవత్సరాల క్రితం హరిహర శివాలయం పై జరగిందని నవంబర్ 2024లో ట్రయల్ కోర్టులో పిటీషన్ దాఖలు కాగా.. ఆ విచారణ వెంటనే స్వీకరించిన ట్రయల్ కోర్టు మసీదులో పురావస్తు శాఖ ద్వారా సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్వే చేపట్టిన సమయంలో మసీదు వద్ద అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు చనిపోయారు. దీంతో ఈ మసీదు సర్వే వివాదాస్పదంగా మారింది. దీంతో మసీదుకు సంబంధించిన ఇంతెజామియా కమిటీ సంభల్ వివాదాస్పద కేసులో ట్రయల్ కోర్టు విచారణకు వ్యతిరేకంగా అలహాబాద్ హై కోర్టుల పిటీషన్ దాఖలు చేసింది. హై కోర్టు ఈ పిటీషన్ పై విచారణ ప్రారంభించి.. ప్రస్తుతాని ట్రయల్ విచారణపై స్టే విధించింది. ఫిబ్రవరి 25, 2025 వరకు ట్రయల్ కోర్టు ఈ కేసులో విచారణ చేపట్టకూడదని ఆదేశాలు జరీచేసింది.

హై కోర్టు లో విచారణ జరుగుతున్న పిటీషన్ లో నాలుగు పార్టీలు బాధ్యలుగా ఉన్నాు. ఇందులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. దీంతో హై కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటీషన్ పై స్పందిస్తూ నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని నిర్దేశించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులు ఫైల్ చేసే కౌంటర్ పై మసీదు కమిటీ మరో రెండు వారాల్లోగా ఒక రిజాయిండర్ కూడా దాఖలు చేయాలని హై కోర్టు సూచించింది.


Also Read: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..

సంభల్ వివాదాస్పద మసీదు కేసులో మసీదు కమిటీ వేసిన పిటీషన్ పై హై కోర్టులోని సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సింగిల్ బెంచ్ లో జస్టిస్ రంజన్ అగర్వాల్ సంభల్ మసీదు కేసుని తిరిగి మొదటి నుంచి విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ విచారణలు ఇక ఫిబ్రవరి 25నే ప్రారంభమవుతాయి.

సంభల్ మసీదు వివాదం, హింస
సంభల్ జిల్లా కోర్టులో నవంబర్ 19, 2024న అడ్వకేట్ హరిశంకర్ జైన్, ఇతరులు కలిసి ఒక పిటీషన్ ఫైల్ చేశారు. ఆ పిటీషన్ ప్రకారం.. సంభల్ జిల్లాలోని షాహి జామా మసీదు కింద హరిహర దేవాలయం శిథిలాలున్నాయని.. అందుకోసం ఈ మసీదు నిర్మాణం చట్టవ్యతిరేకంగా ప్రకటించాలని కోర్టుని పిటీషన్ దారులు కోరారు. దీంతో ఈ కేసులో సంభల్ జిల్లా కోర్టు అదే రోజు మసీదు లోపల పురావస్తు శాఖ చేత సర్వే చేయించాలని ఆదేశించింది. ఆ తరువాత అదే రోజు పురావస్తు శాఖ సర్వే చేసింది. కానీ అది పూర్తి కాలేదు. కొన్ని రోజుల తరువాత మరోసారి మసీదు లోపల పురావస్తు శాఖ సర్వే చేస్తున్న సమయంలో మసీదు బయట కొందరు అల్లరి మూకలు చేరి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. దీంతో పోలీసులు, అల్లరి మూకల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయగా.. నిరసనకారలు కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు షూటింగ్ కూడా చేశారని సమాచారం. ఈ ఘటనలో నలుగురు నిరసనకారలు చనిపోయారు. 20 మంది పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ కేసులో ఆ తరువాత పోలీసులు మొత్తం 50 మంది నిందితులను అరెస్టు చేసి.. దాడి చేసిన వారి లో ఒక యువకుడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పై కూడా తుపాకీతో కాల్చాడు. ఆ యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×