OTT Movie : సూపర్ హీరో సినిమాలంటే చిన్న పిల్లలనుంచి, పెద్ద వాళ్ళ వరకు కదలకుండా చూస్తుంటారు. వీటిలో హీరోలు చేసే విన్యాసాలకు ఫిదా అవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, బిల్లీ బాట్సన్ అనే సూపర్ హీరో సోదరులు, ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే అట్లాస్ కుమార్తెలతో పోరాడుతారు. ఈ పోరాటాలు కనువిందు చేస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Shazam! Fury of the Gods’ 2023లో విడుదలైన అమెరికన్ సూపర్ హీరో చిత్రం. డేవిడ్ ఎఫ్. శాండ్‌బెర్గ్ దర్శకత్వంలో, DC కామిక్స్ పాత్ర షాజామ్ ఆధారంగా రూపొందింది. ఇందులో జాకరీ లెవీ (షాజామ్), ఆషర్ ఏంజెల్ (బిల్లీ బాట్సన్), జాక్ డైలాన్ గ్రేజర్ (ఫ్రెడ్డీ), రాచెల్ జెగ్లర్ (ఆంటియా), లూసీ లియు (కలిప్సో), హెలెన్ మిర్రెన్ (హెస్పెరా) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2023 మార్చి 17న థియేటర్లలో విడుదలై, Amazon Prime Videoలో తెలుగు, తమిళ, ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2019లో వచ్చిన “Shazam!” కి సీక్వెల్ గా వచ్చింది.
బిల్లీ బాట్సన్ అనే ఒక టీనేజర్ “షాజామ్!” అని అరిచి సూపర్ హీరోగా మారుతాడు, తన సోదరులతో కలిసి ఫిలడెల్ఫియాలో హీరోలుగా అందరికి రక్షణ కల్పిస్తాడు. కథ స్టార్ట్ అయినప్పుడు, వీళ్ళు టీమ్‌గా సరిగ్గా పనిచేయలేక, బిల్లీ తన శక్తులను అర్థం చేసుకోవడానికి కష్టపడతాడు. ఇంతలో అట్లాస్ కుమార్తెలైన హెస్పెరా, కలిప్సో, ఆంటియా షాజామ్ ఫ్యామిలీ శక్తులను దొంగిలించడానికి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి వస్తారు. వీళ్ళు ఒక పవర్‌ఫుల్ స్టాఫ్‌ను ఉపయోగించి, మాయా జీవులను (డ్రాగన్, సైక్లోప్స్) సిటీపైకి వదులుతారు. ఇవి ప్రజలపై దాడులు చేయడం మొదలు పెడతాయి.
బిల్లీ తన సోదరులతో కలిసి, ఈ మాయా జీవులను (డిమాన్స్) ఆపడానికి, తమ శక్తులను కాపాడుకోవడానికి పోరాడతాడు. బిల్లీ సోదరుడు ఫ్రెడ్డీ, అట్లాస్ కుమార్తె ఆంటియా మధ్య లవ్ యాంగిల్ కథను ఆసక్తికరంగా మాఅరుస్తుంది. క్లైమాక్స్‌లో బిల్లీ ఒక సాహసోపేతమైన సాక్రిఫైస్ చేస్తాడు. ఈ కథ DC సినిమాల స్టైల్‌లో ట్విస్ట్‌తో ముగుస్తుంది. బిల్లీ చేసే సాక్రిఫైస్ ఏమిటి ? అట్లాస్ ఫ్యామిలీని ఎలా ఎదుర్కొంటాడు ? అనే విషయాలను, ఈ అమెరికన్ సూపర్ హీరోస్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా