E-Paper
Advertisement

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటీటీవైపే చూస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తెలుగు థ్రిల్లర్ సినిమా, ఒక డబుల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా క్లూస్ టీమ్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డ్రామాగా, ఈ సినిమా మర్డర్ మిస్టరీని ఛేదించే సన్నివేశాలతో హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ 

‘అతర్వ’ (Atharva) 2023లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మహేష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కార్తీక్ రాజు లీడ్ రోల్‌లో నటించగా, సిమ్రాన్ చౌదరి, ఆయ్రా జైన్, కల్పిక గణేష్, కబీర్ దుహాన్ సింగ్ సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో టీవీలో స్ట్రీమ్ అవుతోంది. ఇది తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉంది. 1 గంట 56 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.6/10 రేటింగ్ ను పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కర్ణ అనే ఓ యువకుడు, పోలీస్ అవ్వాలనే డ్రీమ్ తో ఉంటాడు. కానీ ఆస్తమా సమస్య వల్ల అతని ప్రయత్నాలు ఫలించకుండా పోతాయి. ఫ్రెండ్స్ సలహాతో అతను క్లూస్ టీమ్‌లో డిటెక్టివ్‌గా చేరతాడు. తన తెలివితో ఓ దొంగతనం కేసును సులభంగా సాల్వ్ చేసి, అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఈ సమయంలో అతని కాలేజీ ఫ్రెండ్ నిత్య క్రైమ్ రిపోర్టర్‌గా కనిపిస్తుంది. కానీ కర్ణ ఆమెపై తన ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్ని , ఆమె బాయ్‌ఫ్రెండ్ శివలను ఎవరో తెలియని వ్యక్తులు షూట్ చేసి చంపడంతో, కర్ణ ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే బాధ్యత తీసుకుంటాడు. ఫస్ట్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్‌లు ఆసక్తికరంగా సాగుతాయి, జోష్ని మర్డర్ ఇంటర్వెల్‌లో కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్నప్పుడు, ఈ మర్డర్ వెనుక పెద్ద కుట్ర ఉందని కర్ణ తెలుసుకుంటాడు. ఈ కేసులో ఆధారాలు తక్కువగా ఉండటంతో, బయోమెట్రిక్ క్లూస్, ఫోరెన్సిక్ ఎలిమెంట్స్‌తో కథ మరింత ఇంటెన్స్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఈ మర్డర్‌ల వెనుక మోటివ్ బయటపడుతుంది. క్లైమాక్స్ లో సీక్వెల్ హింట్‌తో ఈ సినిమా ముగుస్తుంది. ఈ హత్యలు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? కర్ణ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? ఇతని లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

Related News

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

Big Stories

Advertisement
×