BigTV English
Advertisement

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రకరకాల పాత్రలతో తనకంటూ సపరేట్ ఫన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఈ హీరో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించిన ఒక సినిమా ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా, సమాజంలో ట్రాన్స్‌జెండర్ లు ఎదుర్కొనే సమస్యల గురించి చెబుతూ, ఒక రివేంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘హడ్డి’ (Haddi) 2023లో విడుదలైన హిందీ క్రైమ్ డ్రామా మూవీ. అక్షత్ అజయ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. అనురాగ్ కశ్యప్, ఇలా అరుణ్, మహ్మద్ జీషాన్ అయూబ్‌లు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, ఆనందిత స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ ZEE5లో 2023 సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 14 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

హడ్డి (నవాజుద్దీన్ సిద్దిఖీ) అనే ట్రాన్స్‌జెండర్ వ్యక్తి అలహాబాద్ నుంచి ఢిల్లీకి వస్తాడు. అక్కడ ప్రమోద్ అహ్లావత్ అనే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ నడిపే ట్రాన్స్‌జెండర్ గ్యాంగ్‌లో చేరతాడు. హడ్డి ఈ గ్యాంగ్‌లో చేరడం వెనుక అతని లక్ష్యం వేరే ఉంటుంది. అక్కడికి ప్రతీకారం తీర్చుకోవాడానికే వస్తాడు. అతని తల్లి రేవతిని అహ్లావత్ హత్య చేసినందుకు గానూ, హడ్డి తెలివిగా రివేంజ్ స్కెచ్ వేస్తాడు. హడ్డి గ్యాంగ్‌లో చేరి, క్రమంగా వాళ్ల నమ్మకం సంపాదించి, క్రిమినల్ రంగంలో ఎదుగుతాడు. కానీ అతని నిజమైన ఉద్దేశం బయటపడకుండా అందరి ముందు జాగ్రత్తపడతాడు.


సినిమా మధ్యలో ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా హడ్డి గతం, అతని ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీ, ఇర్ఫాన్ అనే వ్యక్తితో అతని లవ్ స్టోరీ గురించి తెలుస్తుంది. ఈ గ్యాంగ్ బోన్ స్మగ్లింగ్ వంటి డార్క్ బిజినెస్‌లో ఉంటుంది. ఇది సినిమాకి మరింత బ్రూటల్ టచ్ ఇస్తుంది. హడ్డి తన పగ తీర్చుకోవడానికి అహ్లావత్ గ్యాంగ్‌ని లోపలి నుంచి బలహీనం చేస్తాడు. క్లైమాక్స్‌లో హడ్డి రివెంజ్, ఎమోషనల్ డ్రామా హైలైట్ అవుతాయి. హడ్డి తన పగ తీర్చుకుంటాడా ? హడ్డి తల్లిని అహ్లావత్ ఎందుకు చంపాడు ? హడ్డి లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×