BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ఓటిటిలోకి ఎన్నో సినిమాలు, రక రకాల భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ఏ భాషలో ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో శారీరక వైకల్యం (మరుగుజ్జు వ్యక్తి) వల్ల సమాజంలో వివక్షను ఎదుర్కొనే ఒక వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ ని కూడా ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘మతిమారన్’ (Mathimaran)

2023లో విడుదలైన తమిళ క్రైమ్ డ్రామా మూవీ. మంత్ర వీరపాండియన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకట్ సెంగుత్తువన్, ఇవానా లీడ్ రోల్స్‌లో నటించగా, ఆరాధ్య, ఎం.ఎస్. భాస్కర్, ఆడుకలం నరేన్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. లెనిన్ బాబు నిర్మించిన ఈ సినిమా, డిసెంబర్ 29, 2023న థియేటర్లలో విడుదలై, 2024 జనవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇది 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.


స్టోరీలోకి వెళ్తే

నెడుమారన్ మరుగుజ్జుగా జన్మించిన ఒక యువకుడు. తిరునల్వేలిలో తన తండ్రి సుందరం, తల్లి, సోదరి మతితో కలిసి జీవిస్తుంటాడు. ఇతను చిన్నతనం నుంచి బాడీ షేమింగ్ తో అవమానాలను భరిస్తుంటాడు. కానీ తన తండ్రిలాగే పోస్ట్‌మన్ కావాలని కలలు కంటాడు. మతి తన ప్రేమికుడితో పారిపోవడంతో, నెడుమారన్ చెన్నైకి వెళ్లి ఆమెను వెతుక్కుంటాడు. చెన్నైలో పోలీసులు కొన్ని మిస్సింగ్, హత్య కేసులతో బిజీగా ఉంటారు. నెడుమారన్ తన కాలేజీ లవ్ ప్రభావతి సహాయంతో మతిని కనిపెడతాడు. కానీ ఆమె భర్త అనుమాన్,  ఓ సీరియల్ కిల్లర్‌గా బయటపడతాడు. పోలీసులతో కలిసి అనుమాన్‌ని నెడుమారన్ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు.

అయితే ఉన్నట్టుండి అనుమాన్ కస్టడీలో చనిపోతాడు. మతి తన భర్త నిజస్వరూపం తెలుసుకుని, అతని ఆహారంలో విషం కలపడంతోనే అతను చనిపోతాడు. కానీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయరు. ఈ సమయంలో నెడుమారన్ పొరుగు ఇంటి అమ్మాయి బాను మిస్సింగ్ కేసును కూడా తీసుకుంటాడు. ఆమె తల్లిదండ్రులకు ఆమెను కనిపెట్టి అప్పగిస్తానని హామీ ఇస్తాడు. కథలో బాడీ షేమింగ్‌పై సోషల్ మెసేజ్, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ అవుతాయి. చివర్లో బానుని నెడుమారన్ కనిపెడతాడా ? తన ఊరికి తిరిగి వెళ్లి పోస్ట్‌మన్‌గా సెటిల్ అవుతాడా ? మతి తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×