OTT Movie : హర్రర్ సినిమాలంటే చెవి కోసుకునే వారి కోసమే ఓ అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్ ను తీసుకొచ్చాము. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, భయపెట్టే అంశాలు మెండుగా ఉండే సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీలో అనవసరంగా పిరమిడ్స్ జోలికి వెళ్ళి, ప్రాణాల మీదకు తెచ్చుకునే కొంతమంది స్నేహితుల కథను చెప్పుకోబోతున్నాము. అందులో ఓ వింత జంతువు వాళ్ళ శరీరాల్లోకి దూరి చంపేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
స్టోరీలోకి వెళితే …
నలుగురు అమెరికన్ యువకులు జెఫ్, ఆమీ, ఎరిక్ ,స్టేసీ మెక్సికోలో విహారయాత్రకు వెళ్తారు. వీళ్ళు జర్మన్ టూరిస్ట్ మాథియాస్, అతని స్నేహితుడు డిమిత్రీతో కలిసి మాథియాస్ సోదరుడు హెన్రిచ్ ను వెతకడానికి ఒక మారుమూల మాయన్ రూయిన్స్ కు వెళతారు. అతను అక్కడే ఒక ఆర్కియాలజికల్ పని చేస్తూ తప్పిపోతాడు. వీళ్ళంతా కలిసి రూయిన్స్‌కు చేరుకున్నప్పుడు, స్థానిక మాయన్ గ్రామస్తులు ఆయుధాలతో వారిని ఆపేస్తారు, కానీ ఆమీ అనుకోకుండా కొన్ని వెపన్స్ ను తాకడంతో వారిని రూయిన్స్‌పైకి బలవంతంగా పంపిస్తారు.
డిమిత్రీ గ్రామస్తులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తే ఏకంగా అతన్ని చంపేస్తారు. మిగిలిన బృందం రూయిన్స్ పైభాగంలో చిక్కుకుంటుంది. అక్కడ హెన్రిచ్ క్యాంప్‌ను చూస్తారు. కానీ అతను అందులో ఉండడు. అయితే రూయిన్స్‌ను కప్పి ఉన్న వైన్స్ సాధారణమైనవి కావని తెలుసుకోవడానికి వాళ్ళకు ఎక్కువ టైమ్ ఏమీ పట్టదు. ఈ వైన్స్ అనే వింత జీవి కదలడం మాత్రమే కాదు, మనిషి మాంసాన్ని కడుపారా ఆరగిస్తుంది కూడా. అంతేకాదు మానవ శరీరాల్లోకి చొచ్చుకుని వెళ్ళి, మనుషుల్ని మానసికంగా కూడా హింసిస్తాయి.
ఈ క్రమంలో మాథియాస్ తీవ్రంగా గాయపడతాడు. వైన్స్ అతని శరీరంలోకి చొచ్చుకుని పోయి, అతని కాళ్ళను తినేస్తాయి. స్టేసీ శరీరంలోకి కూడా వైన్స్ కదలడం మొదలవ్వడంతో ఆమె భయాందోళనకు గురయ్యింది. అయితే అక్కడి నుంచి బయట పడదాం అని ఎంత ట్రై చేసినా, గ్రామస్తులు వారిని రూయిన్స్ నుండి బయటకు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రమాదకరమైన వైన్స్‌ను తాకారు. స్టేసీ, తన శరీరంలో వైన్స్ ఉన్నాయని భయపడి, స్వయంగా గాయపరచుకుంటుంది. ఒక ఘటనలో ఆమె ఎరిక్‌ను అనుకోకుండా గాయపరుస్తుంది. దీంతో వైన్స్ అతన్ని కూడా గాయపరుస్తాయి. చివరికి జెఫ్ ఆమీని తప్పించుకునేందుకు ఒక ప్లాన్ వేస్తాడు. అతను గ్రామస్తులను రెచ్చగొట్టి, ఆమీ పారిపోయేలా చేస్తాడు. కానీ అతన్ని మాత్రం గ్రామస్తులు చంపేస్తారు. సినిమా డార్క్ ఎండింగ్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంతకీ తప్పించుకున్న హీరోయిన్ సేఫేనా? చివరికి ఏం జరిగింది? అన్నదే స్టోరీ.
ఏ ఓటీటీలో ఉందంటే?
2008 లో రిలీజ్ అయిన సర్వైవల్ హారర్ ఫిల్మ్ ‘The Ruins’. ఇది స్కాట్ బి. స్మిత్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. నవలను కూడా ఇదే పేరుతో రాశారు. ఇందులో జోనాథన్ టక్కర్, జెనా మలోన్, షాన్ అష్మోర్, లారా రామ్సే,జో ఆండర్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. Amazon Prime Video లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.