BigTV English

War 2 : ‘వార్ 2 ‘లో ఎన్టీఆర్ కంటే హృతిక్ రెమ్యూనరేషన్ అంత తక్కువా..?

War 2 : ‘వార్ 2 ‘లో ఎన్టీఆర్ కంటే హృతిక్ రెమ్యూనరేషన్ అంత తక్కువా..?

War 2 : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటుగా టాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్..మోస్ట్ అవైటెడ్ కేటగిరీలో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. యష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో ఈ టీజర్ ఒక సెక్షన్ ప్రేక్షకుల్లో మెప్పు పొందినా కానీ, రొటీన్ విజువల్స్ నిరాశపరిచాయంటూ క్రిటిక్స్ విమర్శించారు.. అయితే ఈ మూవీలో హీరోల రెమ్యూనరేషన్ పై మరో వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది…


ఎన్టీఆర్ కన్నా హృతిక్ రెమ్యూనరేషన్ తక్కువ..?

వార్ 2 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సహా ఇతర స్టార్లు అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అతడు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆరంగేట్రం చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో పోటీ పడి మరీ నటిస్తున్నాడు. టాలీవుడ్ లో తారక్ మొదటి సినిమాకి 60 కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటునట్లు సమాచారం. నేను లీడ్ గా చేస్తున్న హృతిక్ కు తక్కువ అంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది.. వార్ 2 కోసం హృతిక్ రోషన్ పారితోషికం రూ. 48 కోట్లుగా నిర్ణయించారని సమాచారం. యష్ రాజ్ ఫిల్మ్స్ అతడితో ఇప్పటికే పలు చిత్రాల్ని నిర్మించింది. కానీ గతంలో కంటే ఎక్కువ పారితోషికం అందిస్తోందని తెలుస్తోంది..


Also Read :“స్పిరిట్” స్టోరీ లీక్.. ఈ ట్విస్ట్ ఊహించలేదు వంగా మామా..

కియారా రెమ్యూనరేషన్.. 

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వాని ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. వార్ 2 టీజర్‌లో బికినీలో ఛమక్కున మెరిసింది కియారా అద్వానీకి భారీ పారితోషికం ముడుతోందని సమాచారం. ఈమెకు దాదాపుగా రూ. 15 కోట్లకు పైగా ఇస్తున్నట్లు ఫిలింనగర్ లో టాక్.. కియరా ఈ చిత్రంలో ఏజెంట్ కబీర్ కి లవర్ గా నటించింది. వార్ 2 ఆగస్టు 14న తెలుగు- హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ముందుగానే సంబరాలు మొదలు పెట్టేశారు.

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే..

బాలీవుడ్ వార్ 2 మూవీ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లోకి రాబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ మామ కాంబోలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల అయిన తర్వాత త్రిపుల్ ఆర్ పార్ట్ 2 చేసే అవకాశం ఉందని సమాచారం..

 

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×