E-Paper
Advertisement

OTT Movie : ప్రాణాలను తీసే డేంజర్ గేమ్… కూతురి కోసం తప్పని తిప్పలు… ఇంటెన్స్ థ్రిల్లర్

OTT Movie : ప్రాణాలను తీసే డేంజర్ గేమ్… కూతురి కోసం తప్పని తిప్పలు… ఇంటెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : రీసెంట్ గా ఒక హాలీవుడ్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ‘స్క్విడ్ గేమ్’ ను తలపించే ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లో ఒకరిగా నిలిచిపోయింది. కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ తండ్రి డెత్ గేమ్ లో కి ఎంట్రీ ఇస్తాడు. ఆ తరువాత సీన్స్ చాలా ఉత్కంఠంగా నడుస్తాయి. ఈ సినిమా థ్రిల్లర్ ఆడియన్స్ ను చూపు తిప్పు కోకుండా చేస్తుంది. ట్రైలర్ లోనే ఈ సినిమా ఆడియన్స్ కి చెమటలు పట్టిస్తోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025 లో వచ్చిన ఈ డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది రన్నింగ్ మ్యాన్’. స్టెఫెన్ కింగ్ 1982 నవల ‘రన్నింగ్ మ్యాన్’ ఆధారంగా తీయబడిన ఈ సినిమాకు ఎడ్గర్ రైట్ దర్శకత్వం వహించారు. ఇందులో గ్లెన్ పౌల్, కాటీ ఓ’బ్రయాన్, మైకల్ సెరా, ఎమిలియా జోన్స్, విలియం ఎచ్. మెసీ ముఖ్య పాత్రల్లో నటించారు. పారామౌంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో ఈ మూవీ 2025 నవంబర్ 14న USలో రిలీజ్ అయింది. 2 గంటల 13 నిమిషాల రన్‌టైమ్ ఐయండిబిలో 7.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 Paramount+, Amazon Prime Videoలో తొందర్లోనే స్ట్రీమింగ్ కి వస్తోంది.

Advertisement

Read Also : మొగుడి మర్డర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… డిటెక్టివ్ తో దోబూచులాటలు

స్టోరీ ఏమిటంటే

న్యూయార్క్ నగరంలో బిలియనీర్లు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంటారు. పేదలు మాత్రం హీనంగా బతుకుతుంటారు. ఈ సమయంలో బెన్ రిచర్డ్స్ అనే సాధారణ మెకానిక్, తన భార్య షీలా, చిన్న కుమార్తె క్యాతరిన్ తో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. క్యాతరిన్‌కి ఒక రేర్ డిసీజ్ (క్యాన్సర్ లాంటిది) వస్తుంది. ట్రీట్‌మెంట్ కోసం 5 మిలియన్ డాలర్లు అవసరం అవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా డబ్బు లేకుండా ట్రీట్‌మెంట్ ఇవ్వలేం అని రిజెక్ట్ చేస్తాయి. ఇప్పుడు బెన్ డబ్బు ఎలాగైనా సంపాదించాలనుకుంటాడు. ఒక పాపులర్ గేమ్ షో “ది రన్నింగ్ మ్యాన్” ఒక్కటే అతని కళ్ళముందు కనబడుతుంది.

Advertisement

అయితే దీనికి అతని భార్య షీలా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది ఒక డెడ్లీ గేమ్. రన్నర్స్ (కాన్టెస్టెంట్స్) 30 రోజులు పట్టుబడకుండా ఉండాలి. ప్రొఫెషనల్ హంటర్స్ చేతికి చిక్కితే చంపేస్తారు. ప్రతి రోజు తప్పించుకుని తిరిగితే ప్రైజ్ మనీ పెరుగుతుంది. బెన్ తన కూతురి కోసం రిస్క్ తీసుకుని ఎంటర్ అవుతాడు. ఇక అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పుడు సీట్ ఎడ్జ్ కి అతుక్కుకుపోయే సీన్స్ చాలానే వస్తాయి. చివరికి ఈ గేమ్ నుంచి బెన్ బతికి బయట పడతాడా ? కూతురికి ఆపరేషన్ చేయిస్తాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×