BigTV English

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పనులు చేయించే సైనికులు … నరకంలో కూడా ఇంత దారుణాలు ఉండవు భయ్యా

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పనులు చేయించే సైనికులు … నరకంలో కూడా ఇంత దారుణాలు ఉండవు భయ్యా

OTT Movie : ఒక భీకర యుద్ధ సమయంలో, ఒక గ్రామంలోని యువతులను సైనికులు కిడ్నాప్ చేస్తారు. వీళ్ళంతా ఒక చీకటి ఇంట్లో బందీలుగా మారతారు.  వీళ్ళను దారుణమైన వేశ్యాగృహంలో ఉంచి నరకం చూపిస్తుంటారు. ఈ భయంకరమైన నరకంలోకి ఏంజెల్ అనే చెవిటి, మూగ యువతిని తీసుకొస్తారు. ఆమె కుటుంబాన్ని ఈ సైనికులు దారుణంగా చంపుతారు. ఇక ఈ వేశ్య గృహంలో ఆమె శరీరంపై ఒక వింతైన గుర్తు కారణంగా, ఆమెను వేశ్యగా ఉపయోగించకుండా, ఆ ఇంటిని నడిపే విక్టర్ ఆమెను సహాయకురాలిగా నియమిస్తాడు. కానీ ఈ ఇంటి గోడల నుంచి ఏంజెల్ రహస్యంగా తప్పించుకునే మార్గాన్ని వెతుకుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఆమె ఈ నరకం నుంచి తప్పించుకోగలదా, లేక ఈ మృగాలు ఆమెను కూడా మింగేస్తాయా? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

1996 లో బాల్కన్ యుద్ధం (యుగోస్లావ్ యుద్ధం) నేపథ్యంలో, ఏంజెల్ (రోసీ డే) అనే చెవిటి, మూగ యువతి, తన కుటుంబాన్ని కిరాతకంగా చంపిన సైనికులచే కిడ్నాప్ చేయబడుతుంది. ఆమెను ‘ది సీజనింగ్ హౌస్’ అనే వేశ్యాగృహంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ యువతులను డ్రగ్స్‌ మత్తులో ఉంచి  సైనికులు ఘోరమైన పనులు చేస్తుంటారు. ఏంజెల్ ముఖంపై ఉన్న ఒక వింతైన బర్త్‌ మార్క్ కారణంగా, ఆమెను వేశ్యగా ఉపయోగించకుండా, ఇంటిని నడిపే విక్టర్ (కెవిన్ హోవార్థ్) ఆమెను సహాయకురాలిగా నియమిస్తాడు. ఆమె విధుల్లో బందీలుగా ఉన్న యువతులకు డ్రగ్స్ ఇవ్వడం, వారికి మేకప్ వేయడం వంటివి చేస్తుంటుంది.


ఏంజెల్ ఈ భయంకరమైన వాతావరణంలో, అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్న యువతులకు సహాయం చేస్తుంది. ఏంజెల్, కొత్తగా వచ్చిన వన్యా అనే యువతితో మూగ భాష ద్వారా స్నేహం చేస్తుంది. ఆమెతో ఒక మంచి స్నేహాన్ని ఏర్పరుస్తుంది. ఈ స్నేహం ఏంజెల్‌కు ఆశను ఇస్తుంది. కానీ ఈ ఇంటిలోని హింస, దుర్మార్గం ఆమెను నిరంతరం భయపెడుతుంది. విక్టర్ ఈ వేశ్యాగృహాన్ని దారుణంగా నడుపుతుంటాడు. ఈ ఇంటికి వచ్చే సైనికులలో, ఏంజెల్ తన కుటుంబాన్ని చంపిన వారిని గుర్తిస్తుంది. చివరికి ఏంజెల్ తన ప్రతీకారం తీర్చుకుంటుందా ? ఆమె కూడా వీళ్ళ చేతిలో నరకం చూస్తుందా ? అనే ప్రశ్నలకి సమాధానం కావాలంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Read Also : పిల్లాడి మిస్సింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యే అన్నదమ్ములు … నరాలు కట్ అయ్యే సస్పెన్స్ మావా

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ మూవీ పేరు ‘ది సీజనింగ్ హౌస్’ (The Seasoning House). 2012 లో వచ్చిన ఈ సినిమాకి పాల్ హైట్ దర్శకత్వం వహించారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) , ఆపిల్ టీవీ (Apple TV) లలో ఈ మూవీ అందుబాటులో ఉంది. 1 గంట 30 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. ఇందులో రోసీ డే (ఏంజెల్), సీన్ పెర్ట్‌వీ (గోరాన్), కెవిన్ హోవార్థ్ (విక్టర్), ఆన్నా వాల్టన్, డొమినిక్ ప్రొవోస్ట్-చాక్లీ (వన్యా), సీన్ క్రానిన్ వంటి నటులు నటించారు.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×