APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. కాసేపటి క్రితమే ఏపీపీఎస్సీ అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూకు 1: 2 నిష్పత్తిలో ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు దాదాపు 4వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు 2024, మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.
ALSO READ: UPSC Notification: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు