OTT Movie : మలయాళం సినిమాలను ఇప్పుడు ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ చూస్తున్నారు మూవీ లవర్స్. రోజురోజుకు ఈ సినిమాలను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే తయ్యారయింది. కథను తెరకెక్కించే విధానం మలయాళం దర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మలయాళం మూవీ లో, ఒక టీచర్ ను తనకి తెలియకుండానే ఆఘాయిత్యానికి గురవుతుంది. ఆ తర్వాత స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మలయాళ డ్రామా థ్రిల్లర్ మూవీ పేరు ‘ది టీచర్’ (The Teacher). 2022 లో వచ్చిన ఈ మూవీకి వివేక్ దర్శకత్వం వహించారు. Nutmeg ప్రొడక్షన్స్, VTV ఫిల్మ్స్ దీనిని నిర్మించారు. ఇందులో హక్కిమ్ షా, చెంబన్ , మంజు పిళ్లైతో, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా లైంగిక వేధింపులను ఎదుర్కున్న మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా దేవిక పని చేస్తూ ఉంటుంది. ఆమె తన భర్త సుజిత్‌తో కలిసి సంతోషంగా ఉంటుంది. పెళ్లి జరిగి చాలా రోజులు గడుస్తున్నా, పిల్లలు లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఈ దంపతులు. ఆమె జీవితం సాధారణంగా సాగుతున్నప్పటికీ, ఒక జిల్లా స్థాయి క్రీడా సమావేశం తర్వాత ఆమె జీవితం తలకిందులవుతుంది. ఒక రోజు ఉదయం ఆమె మెలుకువలోకి వచ్చేసరికి, ఆమెకు మునుపటి రాత్రి జరిగిన విషయాలు గుర్తులేవు. ఆమె శరీరంలో ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఎం జరిగిందో కూడా ఆమెకు గుర్తుకు ఉండదు. ఆ తర్వాత, ఆమె ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటుంది. క్రీడా సమావేశంలో పాల్గొన్న నలుగురు విద్యార్థులు ఆమెపై లైంగిక దాడి చేశారు. దానిని వీడియోలో కూడా రికార్డ్ చేస్తారు . ఈ ఘటన ఆమెను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె సమాజంలో అవమానానికి గురవుతుంది. ఆమె భర్త సుజిత్ ఒక మేల్ నర్స్ గా ఉంటాడు. ఇది జరిగిన తరువాత ఆమెతో దూరంగా ఉంటాడు. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి కూడా ఒప్పుకొడు. ఇది ఆమెను మరింత ఒంటరిగా చేస్తుంది. దేవిక ఈ దాడి గురించి తెలుసుకున్న తర్వాత, తన భర్త, సమాజం నుండి మద్దతు అందకపోవడంతో, న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటుంది. ఆమె అత్తగారు ఒక కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్, ఆమెకు మద్దతుగా నిలుస్తుంది. ఆ నేరస్తులతో పోరాడమని చెప్తుంది. చివరికి దేవిక ఆ నెరస్తుల్ని పట్టుకుంటుందా ? వాళ్ళకు శిక్ష పడేటట్లు చేస్తుందా ? తిరిగి సాధారణ జీవితం గడుపుతుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే, ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను చూడండి.
Read Also : బ్యాట్స్‌మన్ బాయ్స్ తో మర్డర్లు … నగరాన్నే వణికించే గ్యాంగ్ స్టర్ … మైండ్ బ్లాక్ చేసే యాక్షన్ థ్రిల్లర్