OTT Movie : కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ, ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. దునియా విజయ్ దర్శకత్వం వహించి ఇందులో హీరోగా కూడా నటించాడు. ఈ మూవీ బెంగళూరు మహానగరంలో, ఒక గ్యాంగ్ స్టర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. సినిమా ఎక్కువగా యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. ఇందులో ఒక లవ్ స్టోరీ కూడా జత చేశారు. మొత్తానికి ఈ సినిమా యాక్షన్ ప్రియులను అలరించింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సలగ’ (Salaga). 2021 లో విడుదలైన ఈ మూవీకి దునియా విజయ్ దర్శకత్వం వహించారు. ఇందులో అతనే ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఈ మూవీ బెంగళూరు అండర్‌వరల్డ్‌ను నేపథ్యంగా, ఒక గ్యాంగ్‌స్టర్ జీవితం చుట్టూ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ (Sun NXT), (Airtel X stream) లలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక మారుమూల ప్రాంతం నుంచి బెంగళూరుకు చదువు కోవాడానికి వస్తాడు విజయ్ కుమార్. తన తల్లిదండ్రులతో కలసి సంతోషంగా ఉంటాడు. అయితే ఒక మర్డర్ కేసులో చిన్న వయసులోనే విజయ్ ని ఇరికిస్తారు. ఆతరువాత జైలుకి కూడా వెళతాడు.ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా చనిపోతారు. అతను ‘సలగ’ అనే గ్యాంగ్‌స్టర్‌గా మారి, బెంగళూరు నగరాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అతని లక్ష్యం, తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు స్లమ్ శెట్టి, ఇంద్ర, జుట్టు సీనాపై ప్రతీకారం తీర్చుకోవడం. సలగకు బ్యాట్స్‌మన్ బాయ్స్ అనే ఒక క్రూరమైన గ్యాంగ్ ఉంటుంది. జైలులో ఉన్నప్పుడు కూడా తన బ్యాట్స్‌మన్ బాయ్స్ గ్యాంగ్ ద్వారా హత్యలు జరిపిస్తాడు. అతను జైలు నుండి విడుదలైన తర్వాత, సీనా, శెట్టిని హతమారుస్తాడు. ఈ సంఘటనలు జరిగిన తరువాత నగరంలో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతారు.
ఈ పెరిగిన నేరాలను అరికట్టడానికి, నీతిమంతుడైన పోలీసు అధికారి ACP సామ్రాట్ వస్తాడు. ఈ సమ్రాట్, సలగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ సలగ తన తెలివితో తప్పించుకుంటాడు. ఇంతలో సలగ చిన్ననాటి ప్రేయసి సంజన అతనిని ప్రేమిస్తుంది. అతనితో జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. సలగ మొదట ఒప్పుకోకపోయినా, చివరికి ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. ఆ తరువాత అతని ప్రతీకార యాత్ర కొనసాగుతుంది. చివరగా సలగ ఇంద్రను కూడా హతమార్చి, తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడా ? తన ప్రేయసిని పెళ్లి చేసుకుంటాడా ? ACP నేరాలను అరికడతాడా ? ఈ విషయాలను ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : గ్యాంగ్ వార్ లో ఇరుక్కునే సామాన్యుడు … ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ … అందరికీ ఇచ్చిపడేశాడుగా