BigTV English
Advertisement

OTT Movie : నిధి కోసం వేట… ఊహించని క్లైమాక్స్ … అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : నిధి కోసం వేట… ఊహించని క్లైమాక్స్ … అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మన ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. వీటిలో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ఒక ఐలాండ్ లో పనిచేసే ముగ్గురు వ్యక్తులకు ఒక బంగారు నిధి దొరుకుతుంది. ఆ నిధి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వానిషింగ్’ (The Vanishing). 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నైహోల్మ్ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని సెలిన్ జోన్స్, జో బోన్ రచించారు. 1900 సంవత్సరంలో ఫ్లాన్నన్ దీవుల లైట్‌హౌస్ సిబ్బంది అదృశ్యం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో గెరార్డ్ బట్లర్, పీటర్ ముల్లన్, కానర్ స్విండెల్స్ ముగ్గురు లైట్‌హౌస్ కీపర్‌లుగా నటించారు.ఈ మూవీ మార్చి 2018 లో యునైటెడ్ కింగ్‌డమ్ లో విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన భార్యకు వీడ్కోలు చెప్పి, ఒక ఐలాండ్ కి వెళ్తుంటాడు. ఎందుకంటే మూడు వారాలపాటు అందులోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఇతనితో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా వస్తారు. ఈ ముగ్గురు ఒక లైట్ హౌస్ ను మైంటైన్ చేయాల్సి ఉంటుంది. అలా ఫ్యామిలీని వదిలి వీళ్ళంతా అక్కడ ఉద్యోగం చేస్తుంటారు. అయితే ఒక రోజు ఆ ప్రాంతానికి ఒక శవం కొట్టుకుని వస్తుంది. అక్కడికి వెళ్లి ఏమైనా పనికొచ్చే వస్తువులు ఉన్నాయని చూస్తారు. అక్కడ వీళ్లకు ఒక పెద్ద బాక్స్ కనబడుతుంది. అది పనికొస్తుందేమో అని వాళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్తారు. దానిని తెరిచి చూస్తే అందులో చాలా బంగారం ఉంటుంది. దానిని ఎలాగైనా పంచుకోవాలనుకుంటారు. సంవత్సరం పాటు ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా పనిచేసే, ఆ తర్వాత దీనిని పంచుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఈలోగా చనిపోయిన వ్యక్తిని వెతుక్కుంటూ ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతానికి వస్తారు. ఒక బాక్స్ తో ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. వీళ్ళు పొంతనలేని సమాధానం చెప్తారు. అనుమానం వచ్చిన అ వ్యక్తులు, దాడి చేయడం మొదలు పెడతారు. హీరో వాళ్ళని దారుణంగా చంపేస్తాడు. చివరికి వీళ్లంతా ఆ నిధిని పంచుకుంటారా? అది మరి ఎవరికైనా దక్కుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది వానిషింగ్’ (The Vanishing) అనే ఈ మూవీని చూడండి.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×