BigTV English

OTT Movie : స్నేహం కోసం భార్య పిల్లల్ని దూరం పెట్టే మహానుభావుడు… కన్నీళ్లు పెట్టించే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్

OTT Movie : స్నేహం కోసం భార్య పిల్లల్ని దూరం పెట్టే మహానుభావుడు… కన్నీళ్లు పెట్టించే   ఫీల్ గుడ్ ఎంటర్టైనర్

OTT Movie : ఈ బిజీ జీవితంలో మనిషి రిలాక్స్ కోసం సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నాడు. నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. అయితే కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మంచి ఫీలింగ్ తో మనిషిని కదిలిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సినిమా ఎమోషన్స్ తో మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ది వేల్‘ (The Whale). 2022 లో వచ్చిన ఈ సైకలాజికల్ డ్రామా మూవీకి డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బ్రెండన్ ఫ్రేజర్, సాడీ సింక్, హాంగ్ చౌ, టై సింప్‌కిన్స్, సమంతా మోర్టన్ నటించారు. ఊబకాయంతో అనారోగ్యంగా ఉన్న తండ్రి దగ్గరికి, ఎనిమిదేళ్ల క్రితం అతను విడిచిపెట్టిన కుమార్తె రావడంతో స్టోరీ రన్ అవుతుంది. ఇది 2022 డిసెంబర్ 9న U.S.లో థియేటర్‌లలో విడుదలైంది. $3 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ $57 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

చార్లీ అధిక బరువుతో బాధపడుతూ ఉంటాడు. లేచి సరిగ్గా నడవలేక వీల్ చైర్ లోనే తిరుగుతూ ఉంటాడు. ఇతడు ఆన్లైన్ లో ఇంగ్లీష్ క్లాసులు చెప్తూ ఉంటాడు. క్లాసులు తీసుకునే సమయంలో అతని మొహాన్ని చూపించకుండా జాగ్రత్త పడతాడు. ఎందుకంటే అంత భారీ కాయాన్ని చూసి జనాలు మరోలా అనుకుంటారని భయపడతాడు. చార్లీ కి తన ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అతనితోనే ఎక్కువగా సమయం గడిపేవాడు. దీని కారణంగానే భార్యకి సమయం కేటాయించకుండా, ఫ్రెండ్ తోనే ఎక్కువ సమయం గడపడం వల్ల విడాకులు కూడా జరిగిపోయి ఉంటాయి. ఆతరువాత ఫ్రెండ్ కూడా చనిపోవడంతో చార్లీ చాలా దుఃఖంలో మునిగిపోతాడు. ఫ్రెండ్ చెల్లెలు చార్లీని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు చార్లీ కూతురు తన దగ్గరికి వస్తుంది. మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్లే నీ మీద కోపం ఎక్కువ అంటూ చార్లీతో మాట్లాడుతుంది. ఆమె మాటలను చార్లీ పెద్దగా పట్టించుకోడు.

అయితే చార్లీ కూతురుకి ఇంగ్లీషులో నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్పిస్తానని తండ్రి ఆమెతో చెబుతాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో, నా దగ్గర ఉంటే నా అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్ని నీకే ఇస్తానంటూ కూతురికి చెప్తాడు. అయినా తండ్రిని మరింత బాధ పెడుతుంది కూతురు. ఒకరోజు భార్యతో పాటు కూతురు కూడా చార్లీ దగ్గరికి వస్తారు. చార్లీకి తన ఫ్రెండ్ చెల్లెలు సహాయం చేస్తుండటంతో, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావా అని అడుగుతుంది. తన దగ్గర నాకు ఇచ్చే అంత డబ్బు ఏమీ లేదని ఆమె చార్లీ భార్యతో అంటుంది. అయితే చార్లీ ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని డాక్టర్లు చెబుతారు. అధిక బరువు కారణంగా ఇక కొద్ది రోజులే బ్రతికే అవకాశం ఉందని తెలుసుకుంటాడు చార్లీ. చివరికి చార్లీ ఏమవుతాడు? తన కూతురికి ఇంగ్లీష్ నేర్పుతాడా? అతనికి ఉన్న జబ్బు నయమవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ది వేల్’ (The Whale) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×