BigTV English

Rewind 2024: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా మెప్పించిన తమిళ్ మూవీస్ ఇవే..!

Rewind 2024: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా మెప్పించిన తమిళ్ మూవీస్ ఇవే..!

Rewind 2024:తమిళ సినిమాలు అంటేనే అందులో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తమిళంలో హీరో కటౌట్ లేకపోయినా, హీరోయిన్ అందంగా లేకపోయినా సరే హిట్స్ కొడుతూ ఉంటారు అక్కడి దర్శకులు. ఇక తమిళ దర్శకులు ఏదైనా సరే మెసేజ్ ఇచ్చే సినిమాలను మాత్రమే తీస్తూ ఉంటారు అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకే తమిళ సినిమాలకు చాలామంది ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతూ ఉంటారు.అయితే ఈ ఏడాది మాత్రం తమిళ ఇండస్ట్రీని ‘కంగువ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయని చెప్పుకోవచ్చు.భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. మరి ఈ ఏడాది తమిళ సినిమా ఇండస్ట్రీని కాపాడిన ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


మహారాజా:

హీరోగా విలన్ గా సౌత్, నార్త్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఈ ఏడాది ‘మహారాజా’ సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
నితిలన్ తెరకెక్కించిన మహారాజా మూవీ విజయ్ సేతుపతికి మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా
లో విజయ్ సేతుపతి నటన సినిమాకి అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదిక గా స్ట్రీమింగ్ అయి అక్కడ కూడా సత్తా చాటింది.


తంగలాన్ :

పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ (Vikram) హీరోగా తెరకెక్కిన ‘తంగలాన్’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులను అట్రాక్ట్ చేసినప్పటికీ కొంతమందికి నచ్చలేదు. కానీ ఈ సినిమా కూడా ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చింది.ఈ సినిమాతో విక్రమ్ మరొక ప్రయోగాత్మక సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ మూవీ సత్తా చాటింది.

డిమోంటి కాలనీ 2:

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిమోంటి కాలనీ -2’ విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేవు. కానీ విడుదలయ్యాక ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. హార్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హార్రర్ ప్రేక్షకులనైతే విపరీతంగా ఆకట్టుకుంది.అలాగే జీ5 ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అమరన్:

మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన ‘అమరన్’ సినిమాలో శివ కార్తికేయన్ (Shiva karthikeyan) ముకుంద వరదరాజన్ పాత్రలో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి(Sai pallavi) నటించారు. ఈ ఏడాది తమిళ్ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలలో ఈ మూవీ అతిపెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో శివ కార్తికేయన్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యి అక్కడ కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోయింది.

బ్లూ స్టార్:

ఎస్. జయకుమార్ తెరకెక్కించిన ‘బ్లూ స్టార్’ మూవీ లో అనాదిగా వస్తున్న కులమత బేధాల గురించి చూపించారు. ఇప్పటికి కూడా చాలామంది తక్కువ జాతి వారిని హీనంగా చూస్తూ ఉంటారు. ఆటల విషయంలో కూడా ఇలా తక్కువ జాతి ఎక్కువ జాతి చూడడం అనే కాన్సెప్ట్ ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తమిళ ప్రేక్షకులను అలరించింది.

హాట్ స్పాట్ :

డైరెక్టర్ విగ్నేష్ నాలుగు వైవిధ్య రియలిస్టిక్ సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమానే హాట్ స్పాట్. ఈ సినిమా కూడా తమిళ ప్రేక్షకులను అలరించింది.

వాళ్లై:

సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా వాళ్ళై. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్లు చిన్నప్పుడు ఎదుర్కొన్న సంఘటనలు పెద్దయ్యక వారి ప్రవర్తన పై ఎలా ప్రభావం చూపిస్తాయి? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లేట్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి హిట్ అయింది.

మెయిళగన్:

ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మెయిళగన్’ సినిమా తెలుగులో ‘సత్యం శివం’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా లో కార్తీ, అరవిందస్వామి తమ నటనతో ఇరగదీసారు. తమిళ ప్రేక్షకులను ఈ సినిమా అయితే బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యాక ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ లో కూడా మంచి ఆదరణ లభించింది.

కొట్టుక్కళి:

ఒక మహిళ చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది. సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది.? మగవాళ్ళు అమ్మాయిలను అర్థం చేసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు.ఈ సినిమా థియేటర్లలో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ప్రైమ్ వీడియోలో కూడా చాలామంది ఈ సినిమాను వీక్షించారు.

గరుడన్:

R.S.ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన గరుడన్ మూవీలో నమ్మకం, వెన్నుపోటు, స్నేహం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో భైరవం పేరుతో రీమేక్ అవుతుంది.

విడుతలై 2:

విజయ్ సేతుపతి నటించిన విడుతలై 2 మూవీకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. సమాజంలో జరిగే పరిస్థితులను ఎలా ప్రశ్నించాలి? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.ఇక ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది. అలాగే ఈ మూవీ జనవరి రెండో వారం నుండి జీ5లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×