BigTV English

Formula E Race Case: ఫార్ములా కేసు.. నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు?

Formula E Race Case: ఫార్ములా కేసు.. నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు?

Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? దీన్ని నుంచి బయట పడేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? నిధుల విడుదలకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారా? తొలుత అడ్వాన్స్ చెల్లించామని అంగీకరించిన కేటీఆర్, ఎందుకు మాట మార్చారు? హెచ్ఎండీఏ ఛైర్మన్, ఆ శాఖ మంత్రి అనుమతి లేకుండా అధికారులు నిధులు ఎలా విడుదల చేశారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఫార్ములా ఈ కారు రేస్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ముగ్గురికీ శనివారం నోటీసులు ఇచ్చింది. జనవరి రెండు- బీఎల్ఎన్ రెడ్డి, మూడు- అరవింద్ కుమార్, ఏడు- కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. అయితే విచారణకు తనకు కొంత గడువు కావాలని ఈడీని కేటీఆర్ కోరినట్టు సమాచారం.

యూకెకు చెందిన ఫార్ములా కంపెనీ ఈ ఆపరేషన్స్-ఎఫ్ఈవోకు పౌండ్ల రూపంలో నిధులు బదిలీపై దృష్టి పెట్టింది ఈడీ. ఆ కోణంలోనే ఆరా తీస్తోంది. ఈ క్రమంలో తొలుత అధికారులను విచారించనుంది. అక్కడ లభించిన ఆధారాలతో కేటీఆర్‌ను విచారించాలన్నది అధికారుల ఆలోచన.


ఎందుకంటే అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎఫ్ఈవోకు నిధులు బదిలీ చేసినట్టు అధికారి అరవింద్‌కుమార్ గత జనవరిలో సీఎస్‌కు లిఖిత పూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తుకు ఇదే కీలకంగా మారింది. హిమాయత్ నగర్‌లోన ఐవోబీ బ్రాంచ్ నుంచి గతేడాది అక్టోబరులో రెండు విడతలుగా నిధులు బదిలీ చేశారు.

ALSO READ: ఫలించిన రేవంత్ రెడ్డి ప్రయత్నం.. రిజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక ముందడుగు

ఆర్బీఐ అనుమతి లేకపోవడంతో సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా హెచ్ఎండీఏ పెనాల్టీ కట్టింది. లండన్‌లో ఎఫ్ఈవో ఖాతాకు నిధులు చేరిన తర్వాత అవి వేరే ఖాతాలోకి బదిలీ అయ్యాయా? అనేదానిపై ఈడీ లోతుగా ఆరా తీస్తోందని సమాచారం. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ ప్రకారం.. యూకెతో భారత్‌కు ఒప్పందమున్న నేపథ్యంలో ఈడీ సంప్రదింపులు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లండన్ నుంచి నిధులు ఎక్కడికి వెళ్లాయనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

ఇదిలావుండగా న్యాయస్థానంలో రిప్లై అఫిడవిట్‌లో కేటీఆర్ కీలక విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపులతో తనకు సంబంధం లేదన్నారట. విధాన పరమైన అంశాలు చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్ఎండీఏ చూసుకోవాలన్నారు.

10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీపై తనకు ఎలాంటి సంబంధం లేదన్నది ఆయన మాట. విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్‌దేనన్నారు.

 

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×