OTT Movies: ప్రతి నెల కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతాయి. మరోవైపు ఓటీటీ సంస్థల్లో కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఓటీటీ సంస్థల్లో రిలీజ్ అయ్యేందుకు డేట్ ను లాక్ చేసుకుంటున్నాయి. ఈ మధ్య సినిమా హాళ్లలో విడుదల అవుతున్న సినిమాల కన్నా ఎక్కువగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నా సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రీమింగ్ అవుతున్న ప్రతి మూవీ మంచి వ్యూస్ తో పాటుగా సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
ప్రతి ఏడాది సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం కాస్త డిఫరెంట్.. ఫిబ్రవరి నెలలో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ వారం వాలెంటైన్స్ డే కావడంతో సినిమాలు కూడా ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పాల్సిన విశ్వక్ సేన్ లైలా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస గా సినిమాలు చేస్తున్నాడు. ఫిబ్రవరి 14 న మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే బ్రహ్మనందం ఆయన కుమారుడు గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మా ఆనందం కూడా ఈ వారం విడుదల కానుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్కీ కౌశల్ , రష్మిక నటించిన ఛావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.. ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఇక్కడ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
బేబీ జాన్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5
54321 (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 5
ఇన్విసిబుల్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 7
ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7
న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7
నెట్ ఫ్లిక్స్..
ధూమ్ ధామ్ (హిందీ) ఫిబ్రవరి 14
బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్) ఫిబ్రవరి 10
కాదలిక్క నేరమిల్లై (తమిళ్) ఫిబ్రవరి 11
సోనీలివ్..
మార్కో (తెలుగు) ఫిబ్రవరి 14
జీ5..
ప్యార్ టెస్టింగ్ (హిందీ) ఫిబ్రవరి 14
డిస్నీ+హాట్‌స్టార్..
బాబీ రిషి లవ్‌స్టోరీ (హిందీ) ఫిబ్రవరి 11
మనోరమ మ్యాక్స్…
స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7
ఓషానా (మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ )- ఫిబ్రవరి 7
వాలియెట్టన్ 4కె (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 7
మొత్తానికి ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఓటీటీ ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..