BigTV English

Water: సరిపడా నీళ్లు తాగకపోతే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

Water: సరిపడా నీళ్లు తాగకపోతే.. ఎంత ప్రమాదమో తెలుసా ?

Water: శరీరానికి తగినంత నీరు చాలా ముఖ్యం. జీవక్రియలు సక్రమంగా పనిచేయాలంటే.. నీరు అవసరం. కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు త్రాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యానికి తగినంత హైడ్రేషన్ కూడా అవసరం అని మీకు తెలుసా ? మీరు ఏదైనా పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడుతున్నా అంతే కాకుండా కొన్ని రకాల విషయాలను మార్చిపోతున్నా కూడా మీరు పనిపై ఆసక్తి కోల్పోతున్నారని అర్థం చేసుకోండి.


ఇదిలా ఉంటే నిజానికి మెదడు ఎక్కువగా నీటితో తయారవుతుంది. తగినంత నీరు లేకపోతే మెదడు విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా పనిపై దృష్టి పెట్టడంలో కూడా సమస్యలు వస్తాయి. మీరు తగినంత నీరు తాగనప్పుడు మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీని వల్ల ఆలోచించడంలో కూడా ఇబ్బంది పెరుగుతుంది. మాససిక ఆరోగ్యంపై నీరు ( హైడ్రేషన్ ) ఎలాంటి సంబంధాన్ని చూపుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడులో దాదాపు 75 శాతం నీరు ఉంటుందని చెబుతారు. అందుకే తక్కువ నీరు త్రాగడ్ వల్ల మెదడు పనితీరులో సమస్యలు ఏర్పడతాయి. అంతే కాకుండా దీని వల్ల మీరు సరిగ్గా ఆలోచించడంలో కూడా ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు డీ హైడ్రేషన్ కారణంగా మానసిక స్థితిలో కూడా సమస్యలు వస్తాయి.


ఆక్సిజన్, రక్త ప్రసరణ:
తగినంత నీరు త్రాగినప్పడు రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలు కూడా అందుతాయి. మెదడు కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఒక వేళ మీరు డీహైడ్రేషన్‌కు గురైతే మాత్రం రక్త ప్రవాహం నెమ్మదిగా కొనసాగుతుంది. దీని కారణంగా మెదడు పని తీరులో సమస్యలు వస్తాయి.

మెదడు కుంచించుకు పోతుంది:

మీరు తగినంత నీరు త్రాగకపోతే మాత్రం మెదడు కొంచెం కుంచించుకుపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మెదడు చాలా సమస్యలను ఎదుర్కుంటుంది. అంతే కాకుండా వ్యక్తులు ఏదైనా గుర్తుంచుకోవడంతో పాటు పనిపై ఫోకస్ పెట్టడం వంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి. మీ రోజు వారి పనుల్లో కూడా సమస్యలు ఎదర్కుంటారు. ఫలితంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

Also Read: గుండె పోటుకు సంకేతాలివే !

జ్ఞాపకశక్తి ప్రభావితం:
డీ హైడ్రేషన్ మీ జ్ఞాపకశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండే వ్యక్తులు వేగంగా ఆలోచిస్తారు. అంతే కాకుండా బాగా గుర్తుంచుకుంటారు కూడా. పనులపై దృష్టి పెట్టడం కూడా సులభం అవుతుంది. నీరు మీ జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రతి రోజు శరీరానికి తగినంత నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది. డీ హైడ్రేషన్ సమస్య ఎండా కాలంలో  ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా నీరు తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను కూడా తినడం అలవాటు చేసుకోవాలి.

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×