E-Paper
Advertisement

Romantic drama OTT : అమ్మాయి ప్రేమ కోసం వింత కండిషన్… హార్ట్ టచ్ చేసే క్లైమాక్స్

Romantic drama OTT : అమ్మాయి ప్రేమ కోసం వింత కండిషన్… హార్ట్ టచ్ చేసే క్లైమాక్స్
Advertisement

Romantic drama OTT : ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ప్రతివారం స్ట్రీమింగ్ కి వస్తున్నాయి కూడా. అయితే వాటిలో గుర్తుండిపోయే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇది ఒక రొమాంటిక్ సినిమా. క్లైమాక్స్ లో మాత్రం కన్నీళ్ళు గ్యారంటీ. ఈ సినిమాలో నటించిన జంట, రియల్ లైఫ్ లో పెళ్లి కూడా చేసుకోవడం విశేషం. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

తైవానీస్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘మ్యాన్ ఇన్ లవ్’. 2021లో వచ్చిన ఈ సినిమాకి యిన్ చెన్-హావో దర్శకత్వంలో రూపొందింది. . ఇది 2014లో వచ్చిన అదే పేరుతో ఉన్న కొరియన్ సినిమాకు రీమేక్. ఇందులో రాయ్ చియు (అ-చెంగ్), ఆన్ హ్సు (హావో టింగ్). జంటగా నటించారు. నిజ జీవితంలో కూడా ఈ సినిమా నటీనటులు రాయ్ చియు, ఆన్ హ్సు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌తో నెట్‌ఫ్లిక్స్ (Netflix ) లో అందుబాటులో ఉంది. ఈ సినిమా తైవాన్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నటుడు రాయ్ చియు తన నటనకు గాను తైపీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అప్పులు వసూలు చేసే అ-చెంగ్ ఒక లోకల్ మాఫియా గ్యాంగ్ కింద పని చేస్తూ ఉంటాడు. అతను మొరటు మనిషి, కానీ మనసు మాత్రం చాలా మంచిది. అప్పు తీసుకున్న వాళ్ళు కష్టాల్లో ఉంటే తన సొంత డబ్బులే వాళ్ళకి ఇచ్చేంత గొప్ప మనసు. అయితే ఒకరోజు అప్పు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు, అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకుంటున్న హావో టింగ్ అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె పడుతున్న కష్టాలు చూసి, తను పెట్టిన కండిషన్ల ప్రకారం తనతో డేటింగ్ చేస్తే ఆమె అప్పు మొత్తాన్ని మాఫీ చేస్తానని ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు.

మొదట్లో అ-చెంగ్ ప్రవర్తనను హావో టింగ్ అసహ్యించుకున్నా, రోజులు గడిచేకొద్దీ అతనిలోని అమాయకత్వం చూసి అతనికి దగ్గరవుతుంది. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో అ-చెంగ్ కి ప్రాణాంతకమైన వ్యాధి సోకుతుంది. దీంతో స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ మలుపు ఏమిటి ? అ-చెంగ్ కి సోకిన వ్యాధి ఏమిటి ? వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? అనే విషయాలతో ఈ సినిమా కన్నీళ్లు తెప్పించే ముగింపు ఇస్తుంది.

Advertisement

Read Also : సిరీస్‌ గా రాబోతున్న మోస్ట్ డేంజరస్ అడవి దొంగ వీరప్పన్ జీవిత చరిత్ర… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడచ్చు అంటే ?

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×