BigTV English

OTT Movies: హత్యను దాచేందుకు లవర్స్ తంటాలు.. ఊహకు అందని ట్విస్ట్ లు..

OTT Movies: హత్యను దాచేందుకు లవర్స్ తంటాలు.. ఊహకు అందని ట్విస్ట్ లు..

OTT Movies: థియేటర్లలో హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే థియేటర్ లోకి వచ్చిన ప్రతి సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి అందుబాటులోకి వస్తుంది. ఈమధ్య ఇక్కడికి వస్తున్న సినిమాలు మంచి టాక్ని సొంతం చేసుకోవడంతో పాటుగా మిలియన్ వ్యూస్ ని అందుకుంటున్నాయి. ఈ మధ్య వస్తున్నా ప్రతి మూవీ ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నాయి. తాజాగా మరో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ..

ప్రస్తుతం ఓటీటీలోకి వస్తున్న సినిమా పేరు తరుణం. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. కిషన్ దాస్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31న థియేటర్లలోకి రిలీజ్ అయింది. అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అందుకోవడంతో పాటు ఓటీటీ లోకి ఆలస్యంగా వచ్చేస్తుంది.. శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన టెంట్‍కొట్ట ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు అధికారికంగా వెల్లడించింది. థియేటర్ లోకి వచ్చినా దాదాపు 80 రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుంది.


Also Read :మల్టీప్లెక్స్ లో షోలు లేవ్… హిట్ 3 మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?

స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీలో సీఆర్పీఎఫ్ ఆఫీసర్ అయిన అర్జున్ కొన్ని కారణాలతో సస్పెండ్ అవుతాడు.. అయితే తన ఫ్రెండ్ మ్యారేజ్ రీసెప్షన్ లో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇంతలో ఓ రోజు మీరా ఇంట్లోని వంటగగదిలో ఆమె స్నేహితుడి శవాన్ని అర్జున్ చూస్తాడు. ఆ తర్వాత ఆ హత్యను కప్పిపుచ్చి.. విషయం బయటికి రాకుండా చేయాలని అర్జున్, తన లవర్ అనుకుంటారు. ఆ హత్య విషయాన్నీ దాచిపెట్టడానికి వాళ్ళిద్దరూ నానా తంటాలు పడతారు. నిజంగానే వాళ్ళు చేశారా లేక ఇందులో ఇరుక్కున్నారా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ఇది కాస్త కామెడీగా ఉన్నా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లవ్ స్టోరీ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారి థ్రిల్లర్ టర్న్ తీసుకుంటుంది. క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ మూవీలో పుగళ్, ఈడెన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25 నుంచి టెంట్‍కొట్ట ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..

మలయాళ ఇండస్ట్రీ నుంచి తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న హారర్ సినిమాలకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతుంది. తెలుగులో ఈ మధ్య హారర్ సినిమాలు రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా హారర్ సన్నివేశాలతో రాబోతుంది. ఈ సినిమా కోసం ఫాన్స్ అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేలు రిలీజ్ కావలసిన కొత్త సినిమాలు అన్నీ జూన్ కి జులై కి షిఫ్ట్ అయ్యాయి..

Tags

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×