Vijaya Shanthi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజుల్లో ఒక హీరోయిన్ గా పేరు సంపాదించడం ఎంత కష్టమో తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా చాలామంది తెలుగు హీరోయిన్స్ ను ఎంకరేజ్ చేయరు అంటూ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయినా కూడా నిర్మాత ఎస్ కే ఎన్ లాంటి దర్శకులు తెలుగు హీరోయిన్స్ ను ఎంకరేజ్ చేస్తూ కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎస్ కే ఎన్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమాలో తెలుగు హీరోయిన్ ను ఎంకరేజ్ చేశారు. ఇకపోతే ఒకప్పుడు తెలుగు హీరోయిన్ మంచి పేరు సంపాదించుకున్నారు విజయశాంతి. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా ఆ రోజుల్లోనే చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆమె అంతవరకు రావడానికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను
జీవితంలో అమ్మా నాన్న చనిపోవడం వలన జీవితం యొక్క విలువ తెలిసింది. వాళ్లు చనిపోవడం వలన బాధ్యత అంటే ఏంటో దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడు అనిపిస్తుంది. ముక్కోటి దేవతలు కలిసి పెళ్లి చేస్తారు అన్నట్లు, రైట్ టైం లో దేవుడు నాకు మ్యారేజ్ చేశాడు. నాకు ఎవరూ లేని టైంలో నాకు తెలియకుండా నా భర్త నా జీవితంలోకి రావడం, కలవడం ,పెళ్లి చేసుకోవటం అన్ని సడన్ జరిగిపోయాయి. ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఉండాలి కొందరు జీవితం స్మూత్ గా వెళుతుంది,మరికొందరు జీవితం టఫ్ వెళుతుంది. నా జీవితం ఎప్పుడూ స్మూత్ గా లేదు, నేను దెబ్బలు తింటూ నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకెళ్తూ సాధించాను. మా ఫాదర్ కోరిక నన్ను పెద్ద స్టార్ గా చూడాలని అది నెరవేర్చాను.
నా భర్త బాధ్యతను తీసుకున్నారు
నా భర్త కూడా అదే బాధ్యత తీసుకొని నన్ను స్టార్ చేశాడు. పెళ్లయిన తర్వాత నన్ను ఆపేయకుండా, కొంతమందిలా ఇంట్లో కూర్చుని పెట్టకుండా నన్ను ఎంకరేజ్ చేశారు. టాలెంట్ ఉంది అని గమనించి కర్తవ్యం సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాతే ఒసేయ్ రాములమ్మ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. నాకంటూ ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. కర్తవ్యం సినిమా హిట్ అయిన తర్వాతే లేడీ అమితాబ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయంటూ చెప్పకు వచ్చారు. పెళ్లి చేసుకోకుండా ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఒసేయ్ రాములమ్మ ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. కేవలం సినిమాల్లోనే కాదు తర్వాత నుంచి పాలిటిక్స్ లో కూడా సపోర్ట్ చేసి నన్ను నడిపించారు.
Also Read : Srindhi Shetty : ఆ సినిమా ముహూర్తానికి వచ్చి, నాని నన్ను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు