BigTV English

OTT Movie : భార్య మోసానికి భర్త రివేంజ్… మర్డర్ ప్లాన్ తో మైండ్ బ్లాక్

OTT Movie : భార్య మోసానికి భర్త రివేంజ్… మర్డర్ ప్లాన్ తో మైండ్ బ్లాక్

OTT Movie : అక్రమ సంబంధాల వల్ల ఎన్నో నేరాలు జరిగాయి. మరెన్నో కుటుంబాలు నామరూపాల్లేకుండా పోయాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే ఆ కుటుంబం ఎప్పటికైనా చిక్కుల్లో పడక తప్పదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, భార్య వేరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘టిల్ డెత్’ (Till Death). 2021 లో వచ్చిన ఈ అమెరికన్ థ్రిల్లర్ మూవీకి S.K డేల్ దర్శకత్వం వహించారు.  ఇందులో మేగాన్ ఫాక్స్, కాలన్ ముల్వే, ఇయాన్ మాకెన్, అమ్ల్ అమీన్, జాక్ రోత్ నటించారు. ‘టిల్ డెత్’ యునైటెడ్ స్టేట్స్‌లోని థియేటర్‌లలో జూలై 2, 2021న విడుదల చేయబడింది. భార్య మోసానికి భర్త రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. భర్త చనిపోతూ ఆపని చేస్తాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మార్క్ లాయర్ గా ఉంటూ భార్య ఎమ్మి ని సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఎమ్మి, టామ్ అనే వ్యక్తితో భర్తకు తెలియకుండా వ్యవహారం నడుపుతూ ఉంటుంది. అయితే భర్తకు ఈ విషయం తెలిసిపోతుంది. తన భార్యను ఊరికి దూరంగా ఉండే ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇల్లు కూడా మార్క్ దే కావడంతో, పెళ్లిరోజు అక్కడే జరుపుకుంటారు. భార్యకి సర్ప్రైజ్ ఇస్తూ గన్ తో కాల్చుకుని చనిపోతాడు మార్క్. ఇది చూసి షాక్ అవుతుంది ఎమ్మి. ఆ తర్వాత అక్కడికి ఆమె ప్రియుడు వస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు అక్కడికి వచ్చి ప్రియున్ని చంపేస్తారు. ఎమ్మి ని కూడా చంపాలనుకుంటారు. ఎందుకంటే మార్క్ వీళ్లకు తన భార్యను చంపితే డబ్బులు ఇస్తానని చెప్పి ఉంటాడు. ఇప్పుడు అతని శవం అక్కడ కనబడుతుంది. అక్కడ ఉన్న లాకర్ ని తెరిచి చూస్తే అందులో ఒక విషయం రాసి ఉంటుంది.

మీకు కావాల్సింది నా భార్య మెడలో ఉంది అని అందులో ఉంటుంది. నిజానికి ఆమె మెడలో ఒక డైమండ్ గొలుసు ఉంటుంది. దానిని వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఎంత ప్రయత్నించినా ఆ చైన్ కట్ అవ్వదు. అప్పుడు అర్థమవుతుంది అందరికీ, మార్క్ ఇలా చేయడానికి కారణం తెలుసుకుంటారు. తన భార్య తల నరికితే గాని చైన్ రాదని, కావాలనే మార్క్ ఇలా సెట్ చేసి చనిపోయాడని అనుకుంటారు. ఈ క్రమంలో ఏమ్మాకి, ఆ కిల్లర్స్ కి గొడవ జరుగుతుంది. అందులో కిల్లర్ తమ్ముడు చనిపోతాడు. ఆ కోపంతో ఎమ్మి ని ఘోరంగా టార్చర్ చేసి చంపాలనుకుంటాడు. చివరికి ఆ కిల్లర్ ఎమ్మి ని చంపుతాడా? భర్త చనిపోతూ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘టిల్ డెత్’ (Till Death) అనే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×