OTT Movie : ప్లేన్ క్రాష్ సినిమాలు చాలా ఇంట్రెస్టింగా నడుస్తాయి. సాంకేతికలోపం, హైజాకర్ల దాడి వంటి కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి, చివరిదాకా ఉత్కంఠ భరితంగా సాగే బెస్ట్ ప్లేన్ క్రాష్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే . .
Flight (2012)
ఒక విమానం తుఫాను లో మేఘాల మధ్య కదులుతోంది. కెప్టెన్ విప్ విటేకర్ కాక్‌పిట్‌లో మద్యం సేవించిన స్థితిలో ఉన్నాడు. అకస్మాత్తుగా విమానం యాంత్రిక సమస్యలతో కుప్పకూలే ప్రమాదంలో పడుతుంది. అనుభవం ఉన్న కెప్టెన్ విప్ ధైర్యంతో సాధ్యం కాని ల్యాండింగ్‌తో వందలాది ప్రాణాలను కాపాడతాడు. కానీ ఇందులో హీరోయిక్ ప్రవర్తన అనుమానంగా ఉంటుంది. అతని రక్తంలో మద్యం ఉందని దర్యాప్తులో తేలుతుంది. ఇక ఇక్కడ నుండి సినిమా ఒక సస్పెన్స్‌తో నడుస్తుంది. ఈ సినిమాకు రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించారు. దీనికి IMDb లో 7.3/10 రేటింగ్ ఉంది.prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Sully (2016)
2009, జనవరి 15న న్యూయార్క్ నగరంలో ఒక విమానం గాలిలో కదులుతోంది. కెప్టెన్ సుల్లీ కాక్‌పిట్‌లో క్షణాల్లో జీవన్మరణ నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉంటాడు. US ఎయిర్‌వేస్ ఫ్లైట్ 1549 రెండు ఇంజన్లు పక్షుల దాడితో ఆగిపోతాయి. సమీప విమానాశ్రయానికి చేరుకోవడం కూడా అసాధ్యంగా మారుతుంది. ఇక సుల్లీ ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంటాడు. విమానాన్ని హడ్సన్ నదిపై ల్యాండ్ చేయాలనే ఒక సాహసోపేత చర్య తీసుకుంటాడు. ఈ చర్య విమానంలో ఉన్న 155 మంది ప్రాణాలను కాపాడుతుంది. ఈ సినిమా ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలతో, ఉత్కంఠభరితంగా సాగుతుంది. క్లింట్ ఈస్ట్‌వుడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి IMDb లో 7.4/10 రేటింగ్ ఉంది. prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
United 93 (2006)
2001 సెప్టెంబర్ 11 ఉదయం ఒక యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ న్యూవార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతుంది. కొన్ని నిమిషాల్లోనే విమానం హైజాక్ అవుతుంది. విమానంలో ఉన్న ప్రయాణీకులు దేశంలో జరుగుతున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటాగన్‌పై దాడుల గురించి తెలుసుకుంటారు. ఈ విమానం కూడా హైజాకర్ల చేతిలో ఒక ఆయుధంగా మారబోతోందని తెలుసుకుంటారు.అందులోని ప్రయాణీకులు అసాధారణ ధైర్యం చూపించి, హైజాకర్లతో పోరాడేందుకు సిద్ధపడతారు. ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. పాల్ గ్రీన్‌గ్రాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి IMDb లో 7.6/10 రేటింగ్ ఉంది. prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
The Flight of the Phoenix (1965)
సహారా ఎడారి మధ్యలో ఒక చిన్న కార్గో విమానం ఇసుక తుఫానులో చిక్కుకుని కూలిపోతుంది. ఈ విమాన ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు ఎడారిలో బతకడానికి పోరాడాల్సివస్తుంది. నీళ్ళు, ఆహారం లేని స్థితిలో వాళ్ళకి ఒక ఆలోచన పుడుతుంది. ప్రమాదం జరిగిన విమానాన్ని సరిచేసి, అందులోనుంచే బయటపడాలని అనుకుంటారు.ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ సినిమాకి రాబర్ట్ ఆల్డ్రిచ్ దర్శకత్వం వహించారు. దీనికి IMDb లో 7.5/10 రేటింగ్ ఉంది. youtube లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Air Force One (1997)
ఆకాశంలో 35,000 అడుగుల ఎత్తులో, అమెరికా అధ్యక్షుడి విమానం ఉగ్రవాద దాడికి గురవుతుంది. రష్యన్ తీవ్రవాది ఇవాన్ కోర్షునోవ్ నేతృత్వంలోని హైజాకర్లు ఈ విమానాన్ని స్వాధీనం చేసుకుంటారు. అధ్యక్షుడు జేమ్స్ మార్షల్, అతని కుటుంబాన్ని బందీలుగా చేస్తారు. కానీ ఈ అధ్యక్షుడు సాధారణ వ్యక్తి అయితే కాదు. అతను వియత్నాం యుద్ధం హీరో, శిక్షణ పొందిన సైనికుడు. హైజాకర్ల బెదిరింపులకు లొంగకుండా, అధ్యక్షుడు ఒంటరిగా పోరాడతాడు. విమానాన్ని, తన కుటుంబాన్ని, దేశ గౌరవాన్ని కాపాడేందుకు ప్రమాదకర ప్రయత్నం చేస్తాడు. ఒక ఉత్కంఠభరిత యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి వోల్ఫ్‌గాంగ్ పీటర్సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి IMDb లో 6.5/10 రేటింగ్ ఉంది. Jio Hotstar లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Neerja (2016)
1986సెప్టెంబర్ 5న ఫ్లైట్ 73 కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే, ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేస్తారు. ఈ సంక్షోభంలో 23 ఏళ్ల నీర్జా భనోట్ అనే యువతి అసాధారణ ధైర్యం చూపిస్తుంది. 360 మంది ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలు ఆమె చేతుల్లో ఉంటాయి. ఉగ్రవాదుల బెదిరింపులు, తుపాకుల ఒత్తిడి మధ్య, నీర్జా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, ప్రయాణీకులను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయదు. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. రామ్ మాధ్వానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి IMDb లో 7.6/10 రేటింగ్ ఉంది. Jio Hotstar లో ఈ సినిమా అందుబాటులో ఉంది.