Bandla ganesh: బండ్ల గణేష్(Bandla Ganesh) పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారిపోయారు. ఇలా ఈయన నిర్మాతగా రవితేజ, పవన్ కళ్యాణ్ ,ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా సినిమాలకు ఈయన దూరంగా ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించిన అంశాల గురించి తరచూ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు.
సినిమాలకు దూరం..
ఇక బండ్ల గణేష్ చేసే పోస్టులు తల తోక లేకుండా చేస్తుంటారు. దీంతో ఈయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం కలిగిన బండ్ల గణేష్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కు కొంత మంది తనని దూరం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినిమాలకు , రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు? ఇప్పుడు ఎందుకు చేశారు? అనే విషయం గురించి క్లారిటీ లేకుండా ట్వీట్ వేశారు.
పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి…
తాజాగా బండ్ల గణేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ…”అతి ప్రేమ అతి, అభిమానం, అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం ..!” అంటూ ట్వీట్ చేసారు. అయితే ఈ సమయంలో ఈయన ఎవరిని ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశారన్న అంశంపై నెటిజన్లు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి మీరు ఈ పోస్ట్ చేశారన్నా? అంటూ కొంతమంది కామెంట్ లు చేయగా, మరికొందరు మీ గురించి మీరు చాలా బాగా చెప్పుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారంటూ పలువురు భావిస్తున్నారు.
అతి ప్రేమ అతి అభిమానం అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం ………..!
— BANDLA GANESH. (@ganeshbandla) June 13, 2025
పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా ఉన్న బండ్ల గణేష్ తన కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. ఇలా తన గురించి అతిగా ఆలోచించి, తనపై ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని చూపించడం తనకే హానికరంగా మారిందన్న ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేష్ తలా తోక లేకుండా చేసే ఈ పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతూ ఉంటాయి. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ త్వరలోనే అద్భుతమైన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుక రాబోతున్నానని పలు సందర్భాలలో తెలియజేస్తున్న ఇప్పటివరకు ఈయన తన నిర్మాణ సంస్థలో ఒక సినిమాని కూడా ప్రకటించకపోవడం గమనార్హం.