E-Paper
Advertisement

టీనేజ్ గర్ల్స్ సీక్రెట్ మిషన్లు… కొత్త విలన్‌తో హై-వోల్టేజ్ యాక్షన్… పాపులర్ స్పై యానిమేషన్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్

టీనేజ్ గర్ల్స్ సీక్రెట్ మిషన్లు… కొత్త విలన్‌తో హై-వోల్టేజ్ యాక్షన్… పాపులర్ స్పై యానిమేషన్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్
Advertisement

Animated Spy Series on OTT : స్కూల్‌కి వెళ్లే ముగ్గురు అమ్మాయిలు… చూడడానికి ఫ్యాషన్, ఫ్రెండ్‌షిప్, చదువులతో బిజీగా ఉండే సాధారణ టీనేజర్స్. కానీ వాళ్ల అసలు లైఫ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ప్రపంచాన్ని కాపాడే సీక్రెట్ ఏజెంట్లు వాళ్లు. ఒక్కో మిషన్‌లో కొత్త విలన్, కొత్త గ్యాడ్జెట్స్, కొత్త ప్రమాదం… ఈసారి మాత్రం వాళ్ల ముందుకు మరింత డేంజరస్ సైబర్ థ్రెట్ వస్తుంది. ఆ ముగ్గురమ్మాయిలల స్పై అడ్వెంచర్స్‌తో పాపులర్ అయిన సిరీస్ ‘Totally Spies! Season 8’ ఇప్పుడు కొత్త ఎపిసోడ్స్‌తో వచ్చింది. మరి ఈ సీజన్‌లో కథ ఏంటి ? కొత్త మిషన్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

Sam, Clover, Alex ముగ్గురూ టీనేజ్ గర్ల్స్‌లాగే కనిపిస్తారు. కానీ వాళ్లు WOOHP కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్లు. చదువులు, ఫ్రెండ్‌షిప్, వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రమాదకరమైన మిషన్లకు వెళ్లడం వాళ్లకు అలవాటైపోతుంది. సీజన్ 8లో కూడా ఈ ముగ్గురికి వరుసగా కొత్త మిషన్లు ఎదురవుతాయి. ఈసారి టెక్నాలజీ, సైబర్ దాడులు, హైటెక్ గ్యాడ్జెట్స్ మరింత కీలకంగా మారతాయి. గతంలో వూప్ ను డిజిటల్‌గా ఇబ్బంది పెట్టిన Cyberchac తరహా టెక్ బెదిరింపులు కూడా కథలో ఆసక్తిని పెంచుతాయి.

Advertisement

మొదటి ఎపిసోడ్‌లోనే ప్రపంచంలోని పలు నగరాల్లో ఒకేసారి వేగంగా దొంగతనాలు జరుగుతుంటాయి. అసాధారణమైన వేగంతో కదులుతున్న దొంగను పట్టుకునేందుకు స్పైస్ రంగంలోకి దిగుతారు. దర్యాప్తులో Zerlina పేరు బయటకు రావడంతో కేసు మరింత మిస్టరీగా మారుతుంది. మరోవైపు వూప్ నుంచి వచ్చే ఆదేశాలతో ఈ ముగ్గురు అమ్మాయిలు ఈసారి మిషన్‌ను లీడ్ చేయాల్సిన పరిస్థితిలో పడతారు. ఇప్పటివరకు ఫీల్డ్‌లోకి వెళ్లి యాక్షన్ చేసిన వీళ్లు… ఇప్పుడు ప్లాన్ చేయడం, టీమ్‌ను నడిపించడం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది.

ఇక మరో ఎపిసోడ్‌లో వాళ్ల తల్లులు తమ కూతుళ్ల కోసం ఫేక్ మిషన్ ప్లాన్ చేస్తారు. మొదట సరదాగా మొదలైన ఈ స్పై గేమ్‌లోకి నిజమైన విలన్ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారుతుంది. అసలు జెర్లీనా వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ దొంగతనాల వెనుక ఎవరు ఉన్నారు? జరుగుతున్న దాడులను స్పైస్ ఎలా అడ్డుకుంటారు? ఈసారి హీరోయిన్లకు ఎదురయ్యే అతిపెద్ద ముప్పు ఏంటి? అనేదే సీజన్‌లో చూడాల్సిన అసలు కథ.

Advertisement

Also Read : పాడుబడిన స్కూల్ లో పారానార్మల్ సీన్స్… సైకాలజిస్ట్‌కు ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజం

ఈసీజన్ ను ఎక్కడ చూడొచ్చు ? తెలుగులో ఉందా?

‘టోటల్లీ స్పైస్’ ఫ్రాంచైజ్‌కు Stéphane Berry తదితరులు క్రియేటర్లుగా వ్యవహరించారు. 2026లో ఈ సిరీస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీజన్ 8తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ ఆగస్టు 26న విడుదలైంది. కొత్త ఎపిసోడ్లు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి. మొత్తం 24 ఎపిసోడ్లతో పాటు 44 నిమిషాల స్పెషల్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు ఆడియో మాత్రం లేదు. సీక్రెట్ ఏజెంట్స్, ఫన్నీ గ్యాడ్జెట్స్, కొత్త విలన్లు, ఇంటర్నేషనల్ మిషన్స్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ కూడా కోరుకునేవారికి ఈ సీజన్ మంచి ఫన్ వాచ్.

Related News

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

Big Stories

Advertisement
×