OTT Movie : మలయాళం సినిమాలలో ఫహద్ ఫాసిల్ ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇతను నటించిన ఒక మూవీ అతని కెరీర్ లోనే ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫహద్ ఒక చర్చి ఫాస్టర్ గా నటించాడు. ఈ సినిమాలో కొన్ని సంఘటనలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఈ చిత్రం మతాన్ని వ్యాపారంగా మార్చే కార్పొరేట్ వ్యవస్థలు, మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి థీమ్స్‌ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
ఆహా (aha) లో
ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ట్రాన్స్’ (Trance). 2020లో విడుదలైన ఈ సినిమాకి అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించగా, నజ్రియా నజీమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చెంబన్ వినోద్ జోస్, సౌబిన్ షాహిర్, దిలీష్ పోతన్, వినాయకన్, జోజు జార్జ్ సహాయక పాత్రల్లో నటించారు. అమల్ నీరద్ సినిమాటోగ్రఫీ, సుషిన్ శ్యామ్, జాక్సన్ విజయన్ సంగీతం, ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా 2020 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. 2020 ఆగస్టు 7 నుండి ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కన్యాకుమారిలో విజు ప్రసాద్ (ఫహద్ ఫాసిల్) ఒక చిన్న స్థాయి మోటివేషనల్ స్పీకర్. మానసిక సమస్యతో బాధపడుతున్న తన తమ్ముడు కుంజన్ (సూరజ్ స్కంద్)తో కలసి జీవిస్తుంటాడు. విజు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, తన తమ్ముడి చికిత్స కోసం డబ్బు సంపాదించడానికి కష్టపడతాడు. వారి తల్లిదండ్రులు గతంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ప్రభావం విజు, కుంజన్ జీవితాలపై చూపిస్తుంది. విజు తన కెరీర్‌లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, కుంజన్ ఆత్మహత్య చేసుకోవడంతో విజు ఒంటరితనం లో కూరుకుపోతాడు. ఈ దుఃఖంతో అతను కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముంబైకి వెళ్తాడు. పాస్టర్ జోషువా కార్ల్టన్‌గా అవతారం ఎత్తుతాడు.
ముంబైలో, విజు ట్రిపాక్ అనే కార్పొరేట్ కంపెనీకి చెందిన వ్యాపారవేత్తలు సోలమన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్), ఐజాక్ (చెంబన్ వినోద్ జోస్) ఇతని టాలెంట్ ను గుర్తిస్తారు. వీళ్ళు విజును ఒక క్రైస్తవ పాస్టర్‌గా మార్చి, “గ్లోరియస్ చర్చ్” అనే భారీ మత సంస్థను నడపడానికి ఎంచుకుంటారు. విజు ఒక నాస్తికుడైనప్పటికీ, ఆర్థిక లాభం, గుర్తింపు కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. . అలెగ్జాండర్ (దిలీష్ పోతన్) అనే అసిస్టెంట్ సహాయంతో, విజు పాస్టర్ జోషువా కార్ల్టన్‌గా రూపాంతరం చెందుతాడు. అతను శక్తివంతమైన ప్రసంగాలతో భక్తులను తన వైపు తిప్పుకుంటాడు. త్వరలో ఆటను ఒక ప్రముఖ గాడ్‌మన్‌గా మారతాడు. అయితే, ఈ కొత్త జీవితం అతన్ని మాదక ద్రవ్యాలపై ఆధారపడేలా చేస్తుంది. దీనివల్ల అతని మానసిక స్థితి మరింత క్షీనిస్తుంది.
జోషువా కీర్తి పెరిగేకొద్దీ, అతను ఒక టీవీ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ మాథ్యూస్ (సౌబిన్ షాహిర్)ను ఎదుర్కొంటాడు. ఐతే ఇక్కడ అతని మానసిక స్థితి బయట పడుతుంది. ఈ సంఘటన తర్వాత, సోలమన్, ఐజాక్ అతనిని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక కుట్రలో జోషువా తలకు గాయమై కోమాలోకి వెళ్తాడు. మూడవ రోజు అతను మెళుకువలోకి వస్తాడు. ఇది బైబిల్‌లోని యేసు మళ్ళీ తిరిగి వచ్చే సంఘటనని అందరికీ గుర్తుచేస్తుంది. ఈ సంఘటన తర్వాత, జోషువా తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెడతాడు.
ఈ క్రమంలో సోలమన్, ఐజాక్, జోషువా మానసిక స్థితిని అనుమానించి, అతనిని పర్యవేక్షించడానికి ఎస్తేర్ లోపెజ్ (నజ్రియా నజీమ్) అనే మోడల్ ను నియమిస్తారు. ఐతే ఆమె జోషువాతో సన్నిహితంగా ఉంటుంది. ఇక జోషువా మానసిక స్థితి మరింత గందరగోళంగా మారుతుంది. మాదక ద్రవ్యాలు, మత ఉన్మాదంలో మునిగిపోతూ, అతను తన స్వంత నాశనాన్ని తెచ్చుకుంటాడు. కార్పొరేట్ మత సామ్రాజ్యం ముసుగు బయటపడుతుంది. క్లైమాక్స్ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి జోషువా ఏమవుతాడు ? సోలమన్, ఐజాక్ ల బండారం బయట పడుతుందా ? ఎస్తేర్, జోషువా స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోండి.
Read Also : ఫ్రెంచ్ కిస్ అంటేనే వణికిపోయే ఆణిముత్యం… ఓటీటీలోకి వచ్చేసిన 42 ఏళ్ల మాస్టర్ ప్రేమ పాఠాలు