BigTV English

Shubanshu Shukla: భూమి మీద కాదు, సముద్రంలో.. శుభాన్షు ల్యాండింగ్ ని ఎందుకలా డిజైన్ చేశారు?

Shubanshu Shukla: భూమి మీద కాదు, సముద్రంలో.. శుభాన్షు ల్యాండింగ్ ని ఎందుకలా డిజైన్ చేశారు?

టచ్ డౌన్
మీకు గుర్తుండే ఉంటుంది.. 2003 ఫిబ్రవరి 1 న అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే క్రమంలో కల్పనా చావ్లా సహా మరో ఆరుగురు వ్యోమగాములు దుర్మరణంచెందారు. వారు ప్రయాణించిన కొలంబియా షటిల్ భూమికి చేరుకునే క్రమంలో మంటల్లో కాలిపోయింది. కొలంబియా స్పేస్ షటిల్ కెన్నడీ స్పేస్ సెంటర్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. ఇలా అంతరిక్షం నుంచి భూమిపై ల్యాండ్ అయ్యే విధానాన్ని టచ్ డౌన్ అంటారు.


స్ప్లాష్ డౌన్..
ఇటీవల సునీతా విలియమ్స్ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2025 మార్చి 19న సునీతా విలియమ్స్ తో పాటు మరో ముగ్గురు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరు ప్రయాణించిన క్యాప్సూల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సముద్ర జలాల్లో దిగింది. దీన్ని స్ప్లాష్ డౌన్ అంటారు.

ఏది బెస్ట్..?
టచ్ డౌన్ వర్సెస్ స్ప్లాష్ డౌన్.. ఈ రెండిట్లో ఏది ఎక్కువ సేఫ్ అనే విషయంలో శాస్త్రవేత్తలు ఆల్రడీ ఓ నిర్ణయానికి వచ్చేశారు. నేరుగా భూమిపై వాహకనౌకల్ని దించడం కంటే.. సముద్ర జలాల్లో క్యాప్సూల్ ని దించడం సేఫ్ అని కన్ఫామ్ చేసుకున్నారు. అందుకే భూమిపైకి తిరిగి వచ్చే వ్యోమగాములు ఉన్న క్యాప్సూల్ ని సముద్ర జలాల్లో సేఫ్ ల్యాండింగ్ చేస్తున్నారు. అంటే స్ప్లాష్ డౌన్ చేస్తున్నారనమాట. తాజాగా భారత సంతతి వ్యోమగామి శుభాన్షు శుక్లా ల్యాండింగ్ కూడా ఇలానే డిజైన్ చేశారు. ఆయనతోపాటు ఇతర వ్యోమగాములు భూమిపైకి తిరిగి వస్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక, కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ప్రవేశిస్తుంది. ఆక్సియమ్ మిషన్ 4 ని ఇలా విజయవంతంగా ముగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.


ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కి వెళ్లిన శుభాన్షు బృందం తిరుగు ప్రయాణం మొదలు పెట్టింది. మొత్తం నలుగురు వ్యోమగాముల్ని తీసుకొస్తున్న ‘డ్రాగన్’ వ్యోమనౌక అన్‌ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ వ్యోమనౌక దాదాపు 21గంటల పాటు ప్రయాణించి భూమిపైకి చేరుకుంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్ప్లాష్ డౌన్ ప్రక్రియ ద్వారా కాలిఫోర్నియా తీరంలో ఉన్న సముద్ర జలాల్లో దిగుతుంది. అక్కడ్నుంచి వ్యోమగాముల్ని క్వారంటైన్‌కు తరలిస్తారు. వారం రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాతే పూర్తి స్థాయి భూవాతావరణంలోకి తీసుకొస్తారు.

Also Read: భూమి ఐదు సెకన్ల పాటూ తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకే భయపడుతున్నారు

భూమిపైకి తిరిగి వస్తున్న క్యాప్సూల్ నలుగురు వ్యోమగాములతోపాటు 580 పౌండ్లకు పైగా సామగ్రిని తీసుకుని వస్తోంది. ఇందులో NASAకు చెందిన పరికరాలు, 60 కి పైగా ప్రయోగాల నుండి సేకరించిన శాస్త్రీయ డేటా కూడా ఉంది. ISS నుండి క్రూ డ్రాగన్ అన్‌డాకింగ్ ప్రక్రియ నుంచి దాని నిష్క్రమణను కూడా NASA ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష ఔత్సాహికులు ఆక్సియం మిషన్ 4 యొక్క చివరి దశను వీక్షించడానికి నాసా వీలు కల్పించింది. శుభాన్షు శుక్లా టీమ్ రాకకోసం భారత్ తోపాటు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Related News

Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!

Dog population: వీధి కుక్కలు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Delhi Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Aadhar – Pan Cards: ఆధార్, పాన్, ఓటర్ ఐడీ.. దానికి పనికి రావు

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Big Stories

×