E-Paper
Advertisement

17 మందిని పొట్టన పెట్టుకున్న సీరియల్ కిల్లర్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి మావా ?

17 మందిని పొట్టన పెట్టుకున్న సీరియల్ కిల్లర్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి మావా ?
Advertisement

True Crime Series: ఇప్పటిదాకా మీది మిక్సీ, బ్లూ డ్రమ్, హార్పిక్ మర్డర్స్ ను చూసి ఉంటారు. కానీ ఏకంగా ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా నరికి, ఆ పార్ట్స్ ను ఫ్రిజ్ లో పెట్టుకుని తినే సైకో గురించి ఎక్కడైనా చూశారా ? పోనీ విన్నారా ? ఒళ్లు గగరపొడిచేలా ఉన్న ఈ సంఘటనలన్నీ నిజంగా జరిగాయి. ఆ రియల్ సైకో కిల్లర్ స్టోరీనే వెబ్ సిరీస్ రూపంలో మనందరి ముందుకు తీసుకొచ్చారు. ‘డామర్’ (DAHMER) అనే టైటిల్ తో రూపొందిన అలాంటి వెబ్ సిరీసే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరి ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం అపదండి.

కథలోకి వెళ్తే…

జెఫ్రీ డామర్ అనే అబ్బాయి చుట్టూ ఈ సిరీస్ స్టోరీ నడుస్తుంది. చిన్నతనం నుంచే అతను ఒంటరితనంలో పెరుగుతాడు. తల్లిదండ్రుల మధ్య తరచుగా జరిగే గొడవలు, వారి విడాకులు అతని మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. చిన్నప్పటి నుంచి చనిపోయిన జంతువుల శరీరాలను కోసి, వాటి అనాటమీని చూడటం అతనికి అలవాటుగా మారుతుంది. ఆ ఒంటరితనం అతన్ని ఒక భయంకరమైన మనిషిగా మారుస్తుంది.

Advertisement

1978 నుంచి 1991 వరకు జెఫ్రీ డామర్ మిల్వాకీ నగరంలో అమాయక యువకులను, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన అబ్బాయిలను టార్గెట్ చేసుకున్నాడు. మాటలతో నమ్మించి, మద్యం లేదా డ్రగ్స్ ఇచ్చి తన అపార్ట్‌మెంట్‌కు పిలుచుకువెళ్తాడు. అక్కడ వారికి స్పృహ తప్పిన తర్వాత దారుణంగా హత్య చేస్తాడు. కేవలం హత్యలతో ఆగకుండా, శవాలను ముక్కలుగా నరకడం, వాటిపై వింత ప్రయోగాలు చేయడం, కొన్ని శరీర భాగాలను తినడం, ఎముకలను ట్రోఫీలుగా దాచుకోవడం వంటి అత్యంత అమానవీయమైన పనులు చేశాడు.

13 ఏళ్ల వ్యవధిలో సుమారు 17 మంది యువకులను బలి తీసుకున్నాడు. డామర్ ఉంటున్న అపార్ట్‌మెంట్ నుండి నిరంతరం వింత శబ్దాలు, కుళ్ళిన మాంసం వాసన వస్తున్నాయని అతని పక్కింటి మహిళ గ్లెండా క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు పదే పదే ఫిర్యాదు చేస్తుంది. ఒకసారి డామర్ బారి నుంచి తప్పించుకున్న ఒక మైనర్ బాలుడు పోలీసులకు దొరికినా, డామర్ మాటలు నమ్మి పోలీసులు ఆ అబ్బాయిని మళ్లీ డామర్ గదిలోనే వదిలేస్తారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల డామర్ కొన్నేళ్ల పాటు దొరకకుండా క్రైమ్స్ చేస్తూనే ఉంటాడు.

Advertisement

1991లో ట్రేసీ ఎడ్వర్డ్స్ అనే యువకుడు డామర్ బారి నుండి తృటిలో తప్పించుకుని, పోలీసులను నేరుగా అతని రూమ్‌కు తీసుకువస్తాడు. పోలీసులు అక్కడ తనిఖీ చేయగా ఫ్రిజ్, బాక్సుల్లో మానవ శరీర భాగాలు, భయంకరమైన ఫోటోలు దొరుకుతాయి. దాంతో డామర్‌ను అరెస్ట్ చేసి కోర్టు 15 సార్లు జీవిత ఖైదు విధిస్తుంది. చివరికి 1994లో జైల్లోనే తోటి ఖైదీ చేతిలో డామర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇదంతా రియల్ గా జరిగిన స్టోరీ. ‘డామర్ – మానస్టర్ : ది జెఫ్రీ డామర్ స్టోరీ’ అని ఈ కేసును పిలుచుకుంటారు.

తెలుగులో స్ట్రీమింగ్ ?

2022లో విడుదలైన ఇంటర్నేషనల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ DAHMER – Monster: The Jeffrey Dahmer Story. ర్యాన్ మర్ఫీ, ఇయాన్ బ్రెన్నాన్ సృష్టించిన ఈ సిరీస్ Netflixలో ఇంగ్లీష్, హిందీ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులో లేదు. ఇవాన్ పీటర్స్ జెఫ్రీ డామర్‌గా అద్భుతంగా నటించాడు. ఈ సిరీస్ అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్ జెఫ్రీ డామర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది.

Read : అమ్మాయి కదాని సొళ్ళు కారిస్తే… కనికరం లేకుండా ఇదేం పని భయ్యా ? నిద్ర కరువయ్యే ట్విస్ట్

Tags

Related News

అపార్ట్మెంట్లో ఉండే ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సిరీస్… యూనిక్ కొరియన్ క్రైమ్ కామెడీ డ్రామా

అయ్యబాబోయ్ ఇదేం అరాచకం… చీమల్లా దూరి చికాకు పెట్టే చిట్టి మనుషులు

జంతువులను చంపే వింత కిల్లర్… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త కంటెంట్… 2 సినిమాలు, 2 సిరీసులు తెలుగులోనే

మరో యువకుడితో సన్నిహితంగా ప్రేమించిన అమ్మాయి… అచ్చమైన కోనసీమ ప్రేమకథ

40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్

అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

Big Stories

Advertisement
×