E-Paper
Advertisement

కూతురు చేసే హత్యకు తండ్రి బలి… వర్త్ వాచింగ్ మూవీ

కూతురు చేసే హత్యకు తండ్రి బలి… వర్త్ వాచింగ్ మూవీ
Advertisement

Korean legal Thriller: ఫ్యామిలీ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాము. ఎంతకైనా తెగిస్తాము. అందుకే మూవీ లవర్స్ అందరూ ‘దృశ్యం’ లాంటి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ కు కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమాను పిచ్చిగా చూసే సినీ ప్రియులు ఎందరో ఉన్నారు. అంతేకాదు అలాంటి స్టోరీ లైన్ తో ఏ సినిమా వచ్చినా వదలకుండా చూస్తున్నారు. మీకు కూడా ఓటీటీలో ఇలాంటి క్రేజీ సినిమా కావాలా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ‘హార్ట్ బ్లాకెండ్’ (Heart Blackened) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా అచ్చం ‘దృశ్యం’లాగే ఉంటుంది. కాకపోతే ఇది కోర్టు రూమ్ డ్రామా. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ కొరియాలోని ధనవంతుడు, పవర్‌ఫుల్ బిజినెస్ మేగ్నెట్ లిమ్ టై-సాన్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఇతనే మన హీరో. అతనికి మి-రా అనే ఒకే ఒక్క కూతురు ఉంటుంది. టై-సాన్ దేశంలోనే పాపులర్ పాప్ సింగర్ అయిన పార్క్ యు-నాతో ప్రేమలో పడతాడు. నిజానికి ఆమె వయసులో అతని కంటే చాలా చిన్నది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు కూడా. కానీ తండ్రి మరొక మహిళను పెళ్లి చేసుకోవడం కూతురు మి-రాకు అస్సలు నచ్చదు.

Advertisement

యు-నా కేవలం డబ్బు కోసమే తన తండ్రిని వాడుకుంటోందని ఆమె భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు రాత్రి క్లబ్‌లో మద్యం మత్తులో ఉంటుంది మి-రా. అలాగే యు-నాని కలవడానికి ఒక సీక్రెట్ ప్లేస్ కు పిలుస్తుంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే యు-నా దారుణంగా హత్యకు గురై, రోడ్డుపై శవమై కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో లభించిన ఆధారాలు, సీసీటీవీ విజువల్స్, ఆ రాత్రి వారిద్దరి మధ్య జరిగిన గొడవను బట్టి పోలీసులు టై-సాన్ కూతురు మి-రాను ప్రధాన నిందితురాలిగా అరెస్ట్ చేస్తారు.

కానీ విపరీతమైన తాగుడు వల్ల ఆ రాత్రి ఏం జరిగిందనే విషయం మి-రాకు అస్సలు గుర్తుండదు. తనకు కాబోయే భార్య చనిపోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ, ఏకైక కూతురు హంతకురాలు కాదని నిరూపించడానికి టై-సాన్ రంగంలోకి దిగుతాడు. ఆమె కోసం చోయ్ హీ-జంగ్ అనే ఒక లాయర్‌ను డిఫెన్స్ కౌన్సిల్‌ గా నియమిస్తాడు. కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్న సమయంలో కిమ్ డాంగ్-మ్యూంగ్ అనే యు-నా తాలూకు ఒక పిచ్చి స్టాకర్ ఎంట్రీ ఇస్తాడు.

Advertisement

ఆ రాత్రి హత్య ఎలా జరిగిందో చూపించే అసలైన సీసీటీవీ ఫుటేజ్ తన వద్ద ఉందని అతను చెప్తాడు. ఆ రికార్డింగ్‌ను కోర్టులో ఇచ్చినప్పుడు… ఆ రాత్రి కార్ పార్కింగ్‌లో యు-నాను కారుతో గుద్ది చంపింది మి-రానే అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ కథ ఇక్కడే ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏంటి ? ఆ తండ్రి కూతురిని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఎమోషనల్ అండ్ హార్ట్-బ్రేకింగ్ ఎండింగ్ తో ఈ సినిమా ముగుస్తుంది.

తెలుగులో ఉందా లేదా ?

2017లో విడుదలైన పాపులర్ కొరియన్ కోర్ట్‌రూమ్ లీగల్ క్రిమినల్ థ్రిల్లర్ చిత్రం ‘హార్ట్ బ్లాకెండ్’. చైనీస్ హిట్ చిత్రం ‘సైలెంట్ విట్నెస్’ ఆధారంగా దర్శకుడు జంగ్ జి-వూ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో చోయ్ మిన్-సిక్, పార్క్ షిన్-హే ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం భారతదేశంలో అధికారికంగా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ స్ట్రీమింగ్ కావడం లేదు. అంతర్జాతీయంగా Tubi TV, The Roku Channelలో ఉచితంగా కొరియన్ భాషలో చూడవచ్చు.

Read Also: అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

మోగ్లీని రక్షించడానికి వచ్చిన విచిత్ర మృగం… కట్ చేస్తే 20 ఏళ్ల సీక్రెట్ బట్టబయలు… తెలుగులోనే స్ట్రీమింగ్

మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

మహిళల ఇళ్లకు వచ్చే విచిత్రమైన బాక్సులు… కట్ చేస్తే వరుస హత్యలు… ప్రతి కేసు వెనుక ఒకే మైండ్

మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

రాత్రికి రాత్రే రాక్ స్టార్ శవంగా… తీరా శవం దగ్గరకు వెళ్తే ఊహించని షాక్… డార్క్ హారర్ థ్రిల్లర్

కూతురి సీక్రెట్ డైరీతో స్టేజ్‌పై జోకులు… నిజం తెలిసి నిలదీసిన కూతురికి షాకింగ్ ట్విస్ట్… తెలుగులోనే ఈ సిరీస్

Big Stories

Advertisement
×