OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు రకరకాల స్టోరీలతో తెరకెక్కుతున్నాయి. ఈ మధ్య దెయ్యాల గేమ్ లు ఆడి వాటితో సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ జోనర్లో వస్తున్న సినిమాలు బాగానే భయపెడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ‘ట్రూత్ ఆర్ డేర్’ గేమ్ ఆడటం వలన విద్యార్థులు సమస్యల్లో పడతారు. ఈ గేమ్ సరిగ్గా ఆడకపోతే దుష్ట శక్తి వల్ల ప్రమాదాలు వస్తాయి. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒలివియా ఒక యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కొద్ది రోజుల్లో పూర్తి కావస్తుండటంతో, సరదాగా ఒక ట్రిప్ వేయాలనుకుంటారు విద్యార్థులు. ఒలివియా కాలేజీ స్నేహితులతో సరదాగా మెక్సికోకు ట్రిప్ కి వెళ్తుంది. అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో, అక్కడ ఒక కొత్త వ్యక్తి వీళ్ళకి పరిచయం అవుతాడు. వీళ్ళను ‘ట్రూత్ ఆర్ డేర్’ ఆట ఆడమని ఆ వ్యక్తి ఒప్పిస్తాడు. ఈ ఆట సరదాగా మొదలైనప్పటికీ, త్వరలోనే అది ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఆటలో భాగంగా, ఎవరైనా నిజం చెప్పకపోతే లేదా డేర్ చేయకపోతే, ఒక దుష్ట శక్తి వారిని శిక్షిస్తుంది. దీని వల్ల మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
వీళ్ళు పూర్తిగా ఆటలో చిక్కుకుపోతారు. ఈ ఆట వెనుక ఒక శాపం ఉందని, అది మెక్సికోలోని ఒక పాత చర్చితో సంబంధం కలిగి ఉందని స్నేహితులు తెలుసుకుంటారు. ఒలివియా, ఆమె స్నేహితులు ఈ శాపం నుండి బయటపడేందుకు, ఆటను ఎలాగైనా ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ గేమ్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. చివరికి ఈ ప్రమాదకరమైన ఆట నుంచి వీళ్ళు బయటపడతారా ? ఆ శాపంకి విరుగుడు దొరుకుతుందా ? ఆ దుష్ట శక్తి వల్ల ఏం సమస్యలు వస్తాయి ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : నట్ట నడి సముద్రంలో జైలు… ఈ క్రిమినల్స్ వేసిన మాస్టర్ ఎస్కేప్ ప్లాన్ కు దిమ్మ తిరగాల్సిందే
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ అమెరికన్ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ట్రూత్ ఆర్ డేర్’ (Truth or Dare). 2018 లో వచ్చిన ఈ హారర్ మూవీకి జెఫ్ వాడ్లో దర్శకత్వం వహించారు. బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా దీనిని నిర్మించారు. ఇందులో లూసీ హేల్, టైలర్ పోసీ, వైలెట్ బీన్, హేడెన్ స్జెటో, సోఫియా టేలర్ వంటి నటులు నటించారు. మెక్సికోలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థుల చుట్టూ, ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. 2018 ఏప్రిల్ 13న థియేటర్‌లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.