Bigg Boss Nikhil : బుల్లితెర ప్రేక్షకులకు కన్నడ సీరియల్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో తెలుగు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడ హీరోయిన్ ఈయన తెలుగులో వరుసగా సీరియల్స్లలో నటిస్తూ సత్తాను చాటుతున్నాడు. అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టాడు.. తన ఆటతీరుతో మాటలతో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ లో ఉండగానే తన లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన నిఖిల్ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలో కూడా ఈ విషయంపై ప్రస్తావించారు. తాజాగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ షోలో కావ్య పై తనకున్న ఫీలింగ్ ను బయటపెట్టేశాడు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కావ్యపై మనసు విరిగిపోయిందా..?
స్టార్ మాలో ప్రసారం అవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 షో ప్రోమోలో నిఖిల్‌ని ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అడిగింది. నిఖిల్ అనే వ్యక్తి తన సైడ్ నుంచి ప్రేమలో రెండో అవకాశం ఇస్తాడా? ఇవ్వడా? అంటూ శ్రీముఖి అడిగింది. కాసేపు ఆ ప్రశ్నకు ఆలోచించడానికి ఎందుకు అని మళ్లీ తిరిగి శ్రీముఖి కె క్వశ్చన్ వేస్తాడు.. కరెక్ట్ రీజన్ ఉంటే బెటర్ కదా అన్నాడు.. అయితే నిఖిల్ కు శ్రీముఖి ఓ సలహా ఇచ్చింది. మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లమ్‌ని రాసి కాల్చేస్తే ఆ భారం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్పింది. దీంతో నిఖిల్ పేపర్ మీద ఏదో రాసి స్టేజ్ మీదే దాన్ని తగలబెట్టేశాడు.. ఏమైంది ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా? సెకండ్ ఛాన్స్ అంటూ లేదా అని ఆ ప్రోమోన్ చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
నిఖిల్ కెరీర్ విషయానికొస్తే..
కన్నడ హీరో నిఖిల్ తెలుగు బుల్లితెర పై గోరింటాకు సీరియల్ తో దగ్గరయ్యాడు. ఈ సీరియల్ ద్వారా నిఖిల్ మలియక్కల్-కావ్యశ్రీల స్నేహం తర్వాత ప్రేమగా మారిన సంగతి తెలిసిందే. దాాదాపు ఐదేళ్ల పాటు వీళ్లిద్దరూ తమ రిలేషన్‌ని కొనసాగించారు. సరిగ్గా బిగ్‌బాస్ సీజన్ 8కి నిఖిల్ వెళ్లేముందే వీరిద్దరికీ బ్రేకప్ అయింది.. వీళ్ళిద్దరూ బ్రేకప్ కి కారణం ఏంటో తెలియలేదు కానీ బిగ్ బాస్ లో మాత్రం బ్రేకప్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తన కోసం నేను ఎన్నేళ్లయినా వెయిట్ చేస్తానంటూ అన్నడంతో నిఖిల్ కావ్య ల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు. తాజాగా ఈ షోలో కూడా అలానే మాట్లాడటంతో మరోసారి వార్తల్లో వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.. కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే పెద్ద చర్చ జరుగుతుంది.