BigTV English
Advertisement

OTT Movie : నట్ట నడి సముద్రంలో జైలు… ఈ క్రిమినల్స్ వేసిన మాస్టర్ ఎస్కేప్ ప్లాన్ కు దిమ్మ తిరగాల్సిందే

OTT Movie : నట్ట నడి సముద్రంలో జైలు… ఈ క్రిమినల్స్ వేసిన మాస్టర్ ఎస్కేప్ ప్లాన్ కు దిమ్మ తిరగాల్సిందే

OTT Movie : కొన్ని సినిమాలు రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతుంటాయి. ఇవి చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎక్కువగా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కిస్తుంటారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక దొంగ గురించిన  స్టోరీ తీశారు. ఇతను మామూలు దొంగ కాదు. ఏ జైలు నుంచి అయినా తప్పించు కుంటాడు. అందుకే సముద్రంలో ఉండే జైలుకి ఇతన్ని పంపుతారు. ఆ తరువాత స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ?


స్టోరీలోకి వెళితే

సాన్ ఫ్రాన్సిస్కోలో ఆల్కాట్రాజ్ జైలులో కఠినమైన జైలు నిబంధనలను అమలు చేసే, ఒక క్రూరమైన వార్డెన్ ఉంటాడు. ఇక్కడ ఇంతవరకూ ఏ ఖైదీ తప్పించుకుని వెళ్లలేకపోయాడు. అంతలా సెక్యూరిటీ ఉంటుంది ఈ జైలులో. అదీ కాకుండా ఈ జైలు సముద్రంలో ఉంటుంది. అయితే ఫ్రాంక్ మోరిస్ అనే ఒక దొంగ, ఇతర జైళ్ల లో తప్పించుకుంటూ ఉండటంతో, ఆల్కాట్రాజ్‌ జైలుకు ఇతన్ని పంపస్తారు. ఈ జైలు తప్పించుకోవడం అసాధ్యమని అక్కడ ఉన్న వాళ్ళు హెచ్చరిస్తారు. మోరిస్ జైలులో క్లారెన్స్, జాన్, డాక్, లిట్మస్ వంటి ఇతర ఖైదీలతో స్నేహం చేస్తాడు. జైలు అధికారులు పెట్టే హింసతో విసిగిపోయిన మోరిస్, జైలు భద్రతలో లోపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సముద్ర నీటి వల్ల బలహీనమైన కాంక్రీట్ గోడలను కనిపెడతాడు.


ఒక నైల్ కట్టర్ తో ప్రతి రోజూ తాను ఉండే గోడకు రంద్రం చేస్తుంటాడు. నెయిల్ కట్టర్ తో ఒక చిన్న వేపన్ కూడా తయ్యారు చేస్తాడు. దాంతో ఇనుప కడ్డీలను కూడా  కొస్తాడు. పోలీసులకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడతాడు. మిగతా నలుగురు వ్యక్తులు అతనికి సహాయం చేస్తుంటారు. అంతా బాగానే జరుగుతుంది గాని, జైలు నడి సముద్రంలో ఉండటంతో ఆలోచనలో పడతారు. అ తరువాత వాళ్ళు వేసుకునే బట్టలనే లైఫ్ జాకెట్ గా ఉపయోగించుకోవాలనుకుంటారు. ఇక వేసిన కన్నంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఆ నలుగురు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటారా ? పోలీసులకు దొరికిపోతారా ? ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే,  ఈ ప్రిజన్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దెయ్యాలు కూడా దడుచుకునే ఆచారం… ఈ ఘోరాన్ని ఒంటరిగా చూడడమే బెటర్

రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్

ఈ ప్రిజన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్’ (Escape from Alcatraz). 1979 లో వచ్చిన ఈ మూవీకి డాన్ సీగెల్ దర్శకత్వం వహించారు. ఇందులో క్లింట్ ఈస్ట్‌వుడ్ ప్రధాన పాత్రలో పోషించాడు. ఈ స్టోరీ 1962 లో సాన్ ఫ్రాన్సిస్కోలో, ఆల్కాట్రాజ్ ఫెడరల్ పెనిటెన్షియరీ అనే జైలులో, జరిగిన నిజమైన స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×