E-Paper
Advertisement

Tu Yaa Main OTT : మొసలి వేట అమ్మాయి ఆట… థియేటర్లలోకి రాకముందే ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్

Tu Yaa Main OTT : మొసలి వేట అమ్మాయి ఆట… థియేటర్లలోకి రాకముందే ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్
Advertisement

Tu Yaa Main OTT : ఓటీటీలలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ఈతరం మూవీ లవర్స్ ను మెప్పించే సినిమాలు దొరకడం చాలా కష్టం. కానీ తాజాగా జెన్ జీ కిడ్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన ఓ సినిమా థియేటర్లలోకి రాకముందే ఓటీటీ రిలీజ్ డేట్ తో ఆడియన్స్ ను తమ వైపుకు తిప్పుకుంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? థియేటర్లలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఆదర్శ్ గౌరవ్, షనాయా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘తు యా మెయిన్’ (Tu Yaa Main ) సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలవుతుంది. బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ జెన్ జెడ్ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ విడుదల తర్వాత ఎనిమిది వారాల (56 రోజులు) పాటు సినిమా ప్రత్యేకంగా థియేటర్లలోనే ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.ఈ సినిమా వాలెంటైన్స్ డే వీకెండ్ సమయంలో పెద్ద తెరపై విడుదల కావడం విశేషం. థియేటర్లలో ఎక్కువ కాలం ప్రదర్శనకు అవకాశం ఇచ్చేలా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందీ సినిమాలకు సాధారణంగా థియేటర్ నుంచి OTTకి ఎనిమిది వారాల విండో ఉంటుంది. అందువల్ల ఈ చిత్రం బాగుంటే బాక్సాఫీస్‌లో రికార్డులను కొల్లగొట్టే ఛాన్స్ ఉంటుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

తు యా మెయిన్ కథ ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చుట్టూ తిరుగుతుంది. మిస్ వానిటీ (షనాయా కపూర్), ‘ఎ’ (ఆదర్శ్ గౌరవ్) ఇద్దరు భిన్నమైన సామాజిక వర్గాలకు చెందినవారు. వీరు ఒక వైరల్ వీడియో కోసం కలిసి పని చేయాలని అనుకుంటారు. కానీ ఒక క్రూరమైన మొసలి బారిన చిక్కుకుంటారు. ఇక్కడి నుంచి కథ ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. వైరల్ ఫేమ్ కోసం పోరాడాలా ? లేక జీవితాన్ని కాపాడుకోవాలా ? అనే సందిగ్ధంలో పడతారు. “కొన్ని సహకారాలు జీవితాంతం ఉంటాయి. కొన్ని మీ జీవితరేఖను అంతం చేస్తాయి” అనే ట్యాగ్‌లైన్ ఈ మూవీ కథను హైలైట్ చేస్తుంది.

Also Read : తక్కువ బడ్జెట్ తోనే థియేటర్లు, ఓటీటీలు దద్దరిల్లేలా చేసిన సౌత్ బ్లాక్ బస్టర్స్… ఇందులో మీరెన్ని చూశారు ?

Advertisement

ఆదర్శ్ గౌరవ్ (ది వైట్ టైగర్, ఖో గయే హమ్ కహాన్) ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అతను ‘నామ్ కరు బడా’ అనే రాప్ పాటను కూడా పాడాడు. షనాయా కపూర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రలో కనిపిస్తోంది. ఈ జంట కారణంగా సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది. పరుల్ గులాటి కూడా సహాయక పాత్రలో నటిస్తుంది. దర్శకుడు బిజోయ్ నంబియార్ (షైతాన్, వజీర్, తైష్) ఈ చిత్రంలో ఇంటర్నెట్ స్టార్‌డమ్, మానవ మనుగడ, సోషల్ మీడియా ప్రభావం వంటి థీమ్స్‌ను ముఖ్యాంశాలుగా తీసుకున్నారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో ‘ఓ’రోమియో’ వంటి పెద్ద సినిమాతో పోటీ పడనుంది.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×