E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన షురూ.. 13 తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ!

GHMC: జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన షురూ.. 13 తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ!

GHMC:  దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్, అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న (GHMC) జీహెచ్ఎంసీలో ఎట్టకేలకు స్పెషలాఫీసర్ పాలన మొదలైంది. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన పాలక మండలి గడువు  సాయంత్రంతో ముగియటంతో స్పెషలాఫీసర్ పాలనకు లైన్ క్లియర్ అయింది. (GHMC) జీహెచ్ఎంసీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారన్న వాదనలు తెరపైకి వచ్చినా, ఇటీవలే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా, 60 సర్కిల్స్, 12 జోన్లుగా పునర్విభజించిన సంగతి తెల్సిందే. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా అధికార వికేంద్రీకరణ దిశగా పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ త్వరలోనే ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ప్రజాభాగస్వామ్యంతో కూడిన పాలక మండలి అధికార గడువు ముగియటంతో జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలనను మొదలు పెడుతున్నట్లు కీలకమైన ఆదేశాలను సర్కారు జారీ చేసే అవకాశాలున్నాయి.

ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు

నుంచి మొదలుకానున్న స్పెషలాఫీసర్ పాలనలో భాగంగా నిర్ణయాలు అప్పటికపుడు జరిగి, అభివృద్ది వేగవంతం కావటంతో పాటు పౌర, అత్యవసర సేవల నిర్వహణ కూడా మెరుగవనున్నట్లు సమాచారం. నిన్నటి వరకు అధికారంలో కొనసాగిన కౌన్సిల్, స్టాండింగ్ కమిటీలు అభివృద్ది, మౌలిక వసతుల మెరుగు, పౌర సేవల నిర్వహణకు సంబంధించి చేసిన తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలు స్పెషలాఫీసర్ క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జయేష్ రంజన్ ను జీహెచ్ఎంసీకి స్పెషలాఫీసర్ గా నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏడో అంతస్తులో గానీ, ఫస్ట్ ఫ్లోర్ లోని మేయర్ ఆఫీసులో గానీ ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. స్పెషలాఫీసర్ హయాంలోనే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్ల విభనతో పాటు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ, పాలక మండలిలు కొలువుదీరే వరకు స్పెషలాఫీసర్ పాలన కొనసాగనున్నట్లు ఉన్నతాధికార వర్గాల సమచారం.

Also ReadGHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు జారీ చేయనున్న సర్కారు!

పుర పోరు ఫలితాల తర్వాతే మూడు కార్పొరేషన్లపై క్లారిటీ

పట్టణ స్థానిక సంస్థల విలీనంతో దాదాపు 2 వేల 53 కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అంశంపై ఈ నెల 13వ తేదీ తర్వాతే సర్కారు కీలకమైన ఆదేశాలు జారీ చేసి క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్థానిక సంస్థల విలీనం, పునర్విభజనతో పాటు అధికార యంత్రాంగం మూడు కార్పొరేషన్ల విభజనను కూడా సిద్దం చేసి ఉంచినట్లు తెలిసింది.  రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలా? లేక ఒకటిగానే కొనసాగించాలా? లేక బెంగుళూరు మాదిరిగానే మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, జీహెచ్ఎంసీ పెద్దన్నగా వ్యవహారించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మున్సిపల్ కార్పొరేషన్లంటూ బోర్డులను ఏర్పాటు

కానీ ఇప్పటికే గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లంటూ బోర్డులను ఏర్పాటు చేసి, ఆఫీసులను సిద్దం చేస్తున్నందున 13వ తేదీ తర్వాత ఈ అంశంపై మరింత క్లారిటీ ఇచ్చేలా సర్కారు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత జీహెచ్ఎంసీ శంషాబాద్ వరకు 150 వార్డులతో కొనసాగనున్నట్లు, మెలిగిన 150 వార్డులను రెండు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, ఆ తర్వాత అవసరమనుకుంటే కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ల పరిధిలోని వార్డులను మరోసారి పునర్విభజించి, రిజర్వేషన్లను ఖరారు చేసిన మే మాసం చివర్లో గానీ, జూన్ మాసం మొదటి వారంలో గానీ ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also ReadVakiti Srihari: మహదేవప్ప మృతిపై మంత్రి శ్రీహరి దిగ్భ్రాంతి.. నిజం నిప్పులాంటిది.. విచారణకు సిద్ధం!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×