OTT Movie : స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకి, జాహ్నవీ కపూర్ ఫ్యాన్స్‌కి ‘ఉలఝ్’ సినిమా వన్ టైమ్ వాచ్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఫర్వాలేదనిపించింది. ఈ కథ భారతీయ విదేశీ సర్వీస్ (IFS) అధికారి జీవితంలోని స్పై కాన్స్‌పిరసీని చూపిస్తుంది. జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సుహానా భాటియా (జాహ్నవీ కపూర్) ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) ఆఫీసర్. దేశభక్తుల కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ధనరాజ్ భాటియా ఐక్య రాజ్య సమితిలో ఇండియా ప్రతినిధిగా ఉంటాడు. ఆమె తాత సివిక్స్ పుస్తకాల్లో చోటు సంపాదించిన గొప్ప దేశభక్తుడు. సుహానా కాఠ్మాండులోని ఇండియన్ ఎంబసీలో పనిచేస్తూ, అనూహ్యంగా లండన్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో డిప్యూటీ హై కమిషనర్ పోస్ట్‌కి ప్రమోట్ అవుతుంది. ఈ పోస్టింగ్ ఆమె కెరీర్‌లో కీలకం. కానీ చాలామంది రెకమెండేషన్ తో ఆమె ఈ పదవి సంపాదించిందని అనుమానిస్తారు.
లండన్‌లో ఆమె జాకబ్ తమాంగ్, సెబిన్ జోసెఫ్‌కుట్టి లాంటి సహోద్యోగులను కలుస్తుంది. వీళ్లు ఆమె పట్ల సందేహాస్పదంగా ఉంటారు. ఇంతలో ఇండియా-పాకిస్తాన్ రాజకీయ సంబంధాలు ఒక కొత్త ట్విస్ట్‌తో ఉద్రిక్తంగా మారతాయి. ఇండియన్ కేబినెట్ మినిస్టర్ మనోహర్ రావల్ కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. సుహానా ఒక పార్టీలో నకుల్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఇక్కడ నుంచి కథ సస్పెన్స్‌లోకి మారుతుంది. నకుల్‌తో సుహానా సంబంధం ఆమెను ఒక ప్రమాదకరమైన వ్యక్తిగత కుట్రలో చిక్కుకునేలా చేస్తుంది. ఆమె ఒక హనీ ట్రాప్‌లో ఇరుక్కుంటుంది. దీనివల్ల ఆమె దేశ రహస్యాలను బయటపెట్టే పరిస్థితి వస్తుంది.
ఈ కుట్ర వెనుక ISI (పాకిస్తాన్ ఇంటెలిజెన్స్) హస్తం ఉందని తెలుస్తుంది. సుహానా తన కెరీర్, దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్‌లో సెబిన్ ఒక RAW ఏజెంట్, ఆమెకు సహాయం అందిస్తాడు. సుహానా తన బలహీనతలను అధిగమిస్తూ, తెలివిగా ఈ కుట్ర నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. క్లైమాక్స్‌లో ఆమె తీసుకునే నిర్ణయాలు కథను ఉత్కంఠభరితంగా ముగిస్తాయి. సుహానా ఈ ఉచ్చులో నుంచి ఎలా బయటపడుతుంది ? ఆమెను నకుల్ ఎలా మోసం చేశాడు ? సుహానా రెకమెండేషన్ తో ఉద్యోగం తెచ్చుకుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
‘ఉలఝ్’ (Ulajh) సుధాంశు సరియా దర్శకత్వంలో జంగ్లీ పిక్చర్స్ బ్యానర్‌పై వినీత్ జైన్ నిర్మించిన హిందీ స్పై థ్రిల్లర్ సినిమా. ఇందులో జాన్వీ కపూర్ (సుహానా భాటియా), గుల్షన్ దేవయ్య (నకుల్), రోషన్ మాథ్యూ (సెబిన్ జోసెఫ్‌కుట్టి), ఆదిల్ హుస్సేన్ (ధనరాజ్ భాటియా), మీయాంగ్ చాంగ్ (జాకబ్ తమంగ్) నటించారు. ఈ సినిమా 2024 ఆగస్టు 2న థియేటర్లలో విడుదలై, 2024 సెప్టెంబర్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 14 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది.
Read Also : ముసలి భర్త పక్కనుండగా కుర్రాడితో… మెంటలెక్కించే ట్విస్టులు, సర్ప్రైజింగ్ క్లైమాక్స్… ఆ సీన్లు కూడా