BigTV English

OTT Movie : పెళ్లి చేసుకున్న అమ్మాయి గే అని తెలిస్తే… మామ కూడా వదిలిపెట్టకుండా…

OTT Movie : పెళ్లి చేసుకున్న అమ్మాయి గే అని తెలిస్తే… మామ కూడా వదిలిపెట్టకుండా…

OTT Movie : సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటిలో కొన్ని సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హిజ్రా అనే విషయం తెలియకుండా ఒక పల్లెటూరు వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళ జీవితం ఎలా ముందుకు వెళుతుంది అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో సినిమా (Jio Cinema) లో

ఈ రాజస్థానీ డ్రామా మూవీ పేరు ‘అన్ వుమెన్‘ (Un Women). దీనిని హ్యాష్‌ట్యాగ్ ఫిల్మ్స్ LLP బ్యానర్‌పై గుంజన్ గోయెల్ నిర్మించారు. ఈ మూవీ  ప్రేమ, సామాజిక సమస్యలతో ఒక హిజ్రా ఎలా ముందుకు వెళ్ళిందనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీకి పల్లవి రాయ్ దర్శకత్వం వహించారు. ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా (Jio Cinema) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సుమతి వయసుకు వస్తూ ఉండటంతో తన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. చివరికి సుమతి తాను హిజ్రా అని తెలుసుకుంటుంది. ఈ విషయం తండ్రికి తెలుసి సుమతిని తిడుతూ ఉండేవాడు. తల్లి అర్థం చేసుకొని సుమతిని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు తండ్రి చనిపోతాడు. ఆతరువాత కొన్ని రోజులకి తల్లి కూడా చనిపోవడంతో, సుమతి పరిస్థితి మరోలా మారుతుంది. సుమతి, సాహిద్ అనే వ్యక్తి దగ్గర చేరుతుంది. సాహిద్ డబ్బు కోసం, బన్వర్ సింగ్ అనే వ్యక్తికి సుమతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. సుమతి హిజ్రా అనే విషయం తెలీకుండా ఈ పని చేస్తాడు. సుమతి ఈ విషయంలో అయితే బాధపడుతుంది. తనకు వేరే దారి లేక సైలెంట్ గానే ఉంటుంది. మొదటి రాత్రి రోజు బన్వర్ కి విషయం తెలిసిపోతుంది. ఆమెను కొట్టి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటాడు. కొంచెం దూరం వెళ్లాక పరువు పోతుందని, మళ్లీ వెనక్కి వస్తారు. తిరిగి వచ్చిన బన్వర్, అతని తండ్రి ఇంటిని చూసి షాక్ అవుతారు. ఇంటిని చాలా అందంగా పెడుతుంది సుమతి. వాళ్లకు తినడానికి ఫుడ్ కూడా తయారు చేస్తుంది.

అలా సుమతి మీద బన్వర్ సాఫ్ట్ కార్నర్ చూపిస్తాడు. సుమతిని బన్వర్ ప్రేమించడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఏకాంతంగా కూడా గడుపుతారు. ఈ విషయం తెలిసి బన్వర్ తండ్రి కోపం పెంచుకుంటాడు. కొడుకు లేని సమయంలో తండ్రి కూడా సుమతి పై అఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత సుమతి హిజ్రా అని ఊరందరికీ చెప్పి పంచాయితీ పెట్టిస్తాడు బన్వర్ తండ్రి. ఊరి పెద్దలు సుమతిని ఊర్లో ఉండటానికి వీలు లేదని తీర్పు ఇస్తారు. తండ్రికి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలని కూడా చెప్తారు. అయితే తండ్రికి క్షమాపణ చెప్తూ, సుమతిని  పంపించొద్దు అని వేడుకుంటాడు బన్వర్. ఇది చూస్తున్న సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి సుమతి పరిస్థితి ఏమవుతుంది? బన్వర్, సుమతి మళ్లీ కలుస్తారా? సుమతి హిజ్రా లాగా బతకాల్సి వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘అన్ వుమెన్’ (Un Women) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×