BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి మాటలకు బాధపడ్డ మీనా.. పసుపుతాడుతో అందరికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి మాటలకు బాధపడ్డ మీనా.. పసుపుతాడుతో అందరికి షాక్..

Gundeninda GudiGantalu Today episode February 2nd: నిన్నటి ఎపిసోడ్ లో… బాలు రాజేష్ దగ్గరికి వచ్చి నా తప్పు లేకపోయినా నన్నే క్షమాపణలు చెప్పమంటారు ఏంటని జరిగిందంతా బయట పెడతాడు. ఇక బార్ కి వెళ్ళాలని రెడీ అవుతారు. కార్తీక్ రాజేష్ బాలుల కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. ఇక అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు ఎంత చెప్పినా మళ్ళీ నా తప్పేమీ లేదు కదా నాకు కోపం తెప్పించాల్సిన పని ఉంది అని అదే మాట దగ్గరకు తీసుకొస్తాడు. రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ డ్రైవర్ట్ చెయ్యకపోతే అదే పనిలో ఉంటాడు. ఒక వ్యక్తి రాజేష్ చైర్ ని తగులుతాడు ఇక ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాడు దానికి బాలు గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నా తప్పు లేకపోయినా నన్ను క్షమించమని చెప్తారు ఏంట్రా ఇంట్లో భరించలేక ఎక్కడికి వచ్చాను అని బాలు అంటాడు. ఇక తర్వాత మరో వ్యక్తి నన్ను క్షమించు బంగారం అని తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు వాడి దగ్గరికి కూడా వెళ్లి నాలుగు దులిపేస్తాడు బాలు. రాజేష్ ఎందుకురా అందరి మీద కోప్పడతావ్ నీకు కోపం ఎక్కువ అనేసి అంటాడు. దానికి బాలు రాజేష్ ని కొడతాడు కోపం వచ్చింది కదా ఇప్పుడు నాకు అంత కోపం వస్తుంది అని అంటాడు. మీనా చూసి బాలు ఎలాగైనా తాగినట్టు కాకుండా మ్యానేజ్ చెయ్యాలని అనుకుంటాడు. కానీ మీనా కనిపెట్టేస్తుంది. తినడానికి కిందికి వస్తారు. శృతి రవిలు బయట తినేసి వచ్చాం అని చెప్పగానే బాలు రెచ్చిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలు తినడానికి వచ్చి ఉంటాడు. అప్పుడే శృతి రవిలు తినడానికి వస్తారు. ఏమైందని అడుగుతారు. మీనా కష్టపడి చేసింది. తినకుంటే ఎలా అని అరుస్తాడు. బయట తినొచ్చామని శృతి అనగానే బాలు ప్లేటును కింద పడేస్తాడు.. బాలుకి కోపం వస్తుంది. తినే ప్లేట్ ను కింద పడేసి, ఆలుమగలు ఇష్టం ఉన్నట్లు బయట బలాదూర్ గా తిరిగివచ్చి, బయటనే తిని వచ్చామని చెబితే ఎలా? మీ కోసం మీనా కష్టపడి చపాతీలు చేసింది. ఇప్పుడు ఆ చపాతీలు తినాల్సిందేనని బాలు పట్టుపడతాడు.. తాను బయట తిని వచ్చామని, ఆ విషయాన్ని ముందుగా చెప్పకపోవడం తన తప్పేనని రవి సారీ చెబుతాడు. కానీ, బాలు పట్టించుకోడు. రవిని లాక్కొచ్చి నోట్లో చపాతీలను కుక్కుతాడు. దీంతో శృతికి ఎక్కలేని కోపం వస్తుంది. బుద్ధి లేదా అంటూ బాలుని నానా మాటలు అంటుంది. దీంతో బాలు రివర్స్ అవుతాడు. లేచిపోయిన వాళ్ళు బుద్ధి గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నిస్తాడు. దీంతో శ్రుతి రియాక్ట్ అవుతూ.. తాము బయట తినొచ్చామని చెప్తున్నా కదా.. పాడైతే డస్ట్ బిన్ లో పాడేయండి .. కానీ బలవంతంగా నోట్లో కుక్కుతారా ? అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది.. అందరు షాక్ అవుతారు. తన అన్న, తమ్ముడు కూడా మీరు అనుకున్నంత పతీథ్ లు కాదులే అని బాలు ఆ ఇద్దరినీ కూడా ఇరికిస్తారు.. అక్కడితో శృతి, రోహిణి మొగుళ్లను దుమ్ము దులిపేస్తారు.

ఆ తర్వాత రోజు శృతి వాళ్ళ అమ్మ శోభ వాళ్ళ ఇంటికి నగలను తీసుకొని వస్తుంది. అది చూసి ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది. మీనా, రోహిణీ ఇలా అంతా అక్కడే ఉంటారు. అప్పుడు కావాలనే శోభన.. మా శ్రుతికి మేము ఇంత గొప్పగా ఇచ్చాం కదా.. మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చిందో? అంటుంది వెటకారంగా. దాంతో ప్రభావతి మరింత వెటకారంగా.. మేమే ఎదురు ఇవ్వాల్సి వచ్చింది.. ఎందుకంటే వాళ్ల స్థాయి అంతే కదా.. అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. అందరి ముందు తనను తక్కువ చేసి మాట్లాడుతుంది. దానికి మీనా బాధపడుతుంది. ప్రభావతి అనేదే కాకుండా బయట వాళ్ళతో కూడా అనిపిస్తుందా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.


శోభన ఇంట్లో చిచ్చు రాజేసి వెళ్ళిపోతుంది. దానికి ప్రభావతికి దిమ్మతిరిగే షాకిస్తుంది మీనా.. ఇంటి ముందు మీనా చెవులకు కూడా బంగారు కమ్మలు లేకుండా.. చీరతో మెడ, భుజాలు కప్పుకుని నిలబడి ఉంటుంది. ఎదురుగా ప్రభావతి, సత్యం ఉంటారు. వెనుక రవి, శ్రుతి.. ఆ పక్కనే మనోజ్, రోహిణీ కూడా ఉంటారు. మీనా ఆవేశంగా ప్రభావతితో.. మీరువేసిన బంగారం మీరే తీసుకోండి.. అంటూ అన్నీ అందిస్తుంటే.. ప్రభావతి పొగరుగా.. నీ మెడలో తాళి బొట్టు కూడా నీ బాబు చేయించింది కాదు.. అంటుంది. వెంటనే మీనా అంతే ఆవేశంగా బంగారు తాడు చేత్తో చూపిస్తూ.. అందుకే అది కూడా తీసుకొచ్చాను..అంటుంది ఆవేశంగా. అప్పుడే బాలు గేట్ తీసి, లోపలికి వస్తూ ఉంటాడు. అంతా విన్నట్లే చూపించారు. మీనా అలా చేసేసరికి.. సత్యం, రవి, శ్రుతి, మౌనిక, రోహిణీ, ప్రభావతి అంతా అంతా షాక్ అవుతారు.. ఈతతంగాన్ని బాలు చూస్తుంటాడు.. చూశారండి దీనికి ఒక మాట అన్నాగానే ఎంత పొగరు వచ్చిందని ప్రభావతి అంటుంది. నీ మాటలు తూటాల్లాగా ఉంటే అందుకే మీనా బాధ పడింది. ఇది కూడా తీసుకుని నువ్వు పండగ చేసుకో అనేసి అంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో బాలు ఏమైనా రచ్చ చేస్తాడేమో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Big Stories

×