OTT Movie : ఫాంటసీ సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఈ సినిమాలలో ఉండే విజువల్స్ వేరే ప్రపంచంలోకి వెళ్లినట్టు చేస్తాయి. ఊహకు అందని సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మ్యాజిక్ పవర్ ఉండే ఒక గుర్రం హీరోకి లభిస్తుంది. ఆ గుర్రం ద్వారా హీరో చాలా విన్యాసాలే చేస్తాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫాంటసీ మూవీ పేరు ‘అపాన్ ది మ్యాజిక్ రోడ్స్’ (Upon the magic roads). 2021లో విడుదలైన ఈ రష్యన్ ఫాంటసీ మూవీకి ఒలేగ్ పోగోడిన్ దర్శకత్వం వహించారు. CTB ఫిల్మ్ కంపెనీ, CGF కంపెనీ కలసి ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ ప్యోటర్ పావ్లోవిచ్ యెర్షోవ్ రాసిన1850ల నాటి ‘ది లిటిల్ హంప్‌బ్యాక్డ్ హార్స్’ జానపద కథ నుండి తెరకెక్కింది. ఈ మూవీలో ఇవాన్ ది ఫూల్‌గా అంటోన్ షాగిన్ , మైడెన్‌గా పౌలినా ఆండ్రీవా నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో ఫ్యామిలీతో కలిసి, ఒక మారుమూల ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రాంతంలో ఒక జంతువు పంటను నాశనం చేసి ఉంటుంది. రాత్రి సమయంలో కాపలా ఉండమని తండ్రి కొడుక్కి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద ఆకారంలో ఉండే ఒక తెల్లటి గుర్రం కనిపిస్తుంది. అది చాలా వేగంగా పరిగెడుతుంది. ఆకాశంలో కూడా వెళ్లి హీరోకి చుక్కలు చూపిస్తుంది ఆ గుర్రం. చివరికి అది ఒక గోతిలో పడడంతో, దానిని కాపాడి బయటకు తీస్తాడు హీరో. అందుకు ఆ గుర్రం అతనికి కృతజ్ఞత చెప్తుంది. ఇంకెప్పుడు పంటను నాశనం చేయొద్దని దానికి చెప్తాడు హీరో. అలా తెల్లవారి లేచి చూసేసరికి అతని దగ్గర ఒక చిన్న గుర్రం ఉంటుంది. దానికి కూడా చాలా పవర్స్ ఉంటాయి. తన దగ్గర మరో రెండు గుర్రాలు ఉండటంతో, వాటిని రాజుకి చూపించాలని వెళ్తాడు.
అయితే రాజు వాటిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ గుర్రాల వేగానికి రాజు కింద పడిపోతాడు. హీరో బాగా నవ్వడంతో అతనికి శిక్ష విధించాలనుకుంటాడు. అతనికి భయంకరమైన కొన్ని పనులు చెప్తాడు. రాజు చెప్పే పనులన్నీ అవలీలగా చేస్తాడు హీరో. ఎందుకంటే అతని దగ్గర ఒక మ్యాజికల్ హార్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే రాజు, ఒక దీవిలో ఉండే అందమైన రాణిని కూడా తీసుకు రమ్మంటాడు. ఆమెను తీసుకుని వచ్చే క్రమంలో హీరో ప్రేమలో పడతాడు. ఆమె ముసలి రాజుని నిరాకరించడంతో, తనని బందీని చేస్తాడు. ఆ తర్వాత హీరో ఆమెను విడిపించే ప్రయత్నం చేస్తుంటాడు. చివరికి హీరో రాణిన్ కాపాడుతాడా? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా? రాజు వీళ్ళపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.